పదిహేను కిలోలు తగ్గిన లేడీ కమెడియన్
Send us your feedback to audioarticles@vaarta.com
విద్యుల్లేఖా రామన్.. తమిళ నటి. సీనియర్ తమిళ నటుడు మోహన్ రామన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచంయ అయ్యారు. హీరోయిన్ ఫ్రెండ్ ఫాత్రలో కామెడీని పండించే పాత్రలో విద్యుల్లేఖా రామన్ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. లావుగా ఉండటం ఈమెకు కలిసొచ్చిందేమో కానీ.. ఈమెకు మాత్రం లావుగా ఉండటం నచ్చలేదట. అందుకని బరువు తగ్గే పనిని చాలా సీరియస్‌గా చేసిందట విద్యుల్లేఖా రామన్. ఏడు నెలలు కాలంలో 15 కిలోల బరువు తగ్గిందట.
ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేశారు. `సవ్యసాచి`లో చైతన్యతో దిగిన ఫొటోను, వెంకీమామలో చైతుతో దిగిన ఫొటోను పక్క పక్కనే పోస్ట్ చేసి తాను 15 కిలోల బరువు తగ్గానని, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈమె పోస్ట్ చూసిన కొందరు బరువు తగ్గే యాడ్‌లో ముందు.. తర్వాత అనేలా ఉందని సరదాగా అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments