ప‌దిహేను కిలోలు త‌గ్గిన లేడీ క‌మెడియ‌న్‌

  • IndiaGlitz, [Wednesday,July 03 2019]

విద్యుల్లేఖా రామ‌న్‌.. త‌మిళ న‌టి. సీనియ‌ర్ త‌మిళ నటుడు మోహ‌న్ రామ‌న్ కుమార్తెగా ఇండ‌స్ట్రీకి ప‌రిచంయ అయ్యారు. హీరోయిన్ ఫ్రెండ్ ఫాత్ర‌లో కామెడీని పండించే పాత్ర‌లో విద్యుల్లేఖా రామ‌న్ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. లావుగా ఉండ‌టం ఈమెకు క‌లిసొచ్చిందేమో కానీ.. ఈమెకు మాత్రం లావుగా ఉండ‌టం న‌చ్చ‌లేద‌ట‌. అందుక‌ని బ‌రువు త‌గ్గే ప‌నిని చాలా సీరియ‌స్‌గా చేసింద‌ట విద్యుల్లేఖా రామ‌న్‌. ఏడు నెల‌లు కాలంలో 15 కిలోల బ‌రువు త‌గ్గింద‌ట‌.

ఈ విష‌యాన్ని ఆమె ట్విట్ట‌ర్ ద్వారా స్వ‌యంగా తెలియ‌జేశారు. 'స‌వ్యసాచి'లో చైత‌న్య‌తో దిగిన ఫొటోను, వెంకీమామ‌లో చైతుతో దిగిన ఫొటోను ప‌క్క ప‌క్క‌నే పోస్ట్ చేసి తాను 15 కిలోల బ‌రువు త‌గ్గాన‌ని, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. ఈమె పోస్ట్ చూసిన కొంద‌రు బ‌రువు త‌గ్గే యాడ్‌లో ముందు.. త‌ర్వాత అనేలా ఉందని స‌ర‌దాగా అంటున్నారు.

More News

రోశయ్య ఆవిష్కరించిన 'పోలీస్ పటాస్' ట్రైలర్

ఆయేషా హబీబ్ ,రవికాలే ప్రధాన పాత్రలో శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "పోలీస్ పటాస్".

భాగ్య‌శ్రీ భ‌ర్త అరెస్ట్‌

భాగ్య‌శ్రీ అంటే ఎవ‌రికీ ఠ‌క్కున గుర్తుకు రాదేమో కానీ.. `ప్రేమ పావురాలు` హీరోయిన్ అంటే వెంట‌నే గుర్తుకు వస్తుంది.

లక్కీ అంటే అనసూయదే... ఇప్పుడిక డబుల్ కిక్!

అవును నిజమే.. లక్కీ అంటే హాట్ యాంకర్ అనసూయదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు మూడు తరాల హీరోలతో నటించి అటు సినిమాలతో..

జనసేనలో బ్రదర్ నాగబాబుకు పవన్ కీలక పదవి!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన రానున్న ఎన్నికల్లో అయినా రాణించాలని ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్తోంది.

‘నిజాయితీ గురించి మాట్లాడే మీ ధైర్యానికి జోహార్లు బాబూ’!!

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా వేదికగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ముఖ్యంగా విత్తనాల కొరతపై వైసీపీ-టీడీపీ నేతలు కౌంటర్ల వర్షం కురిపించుకుంటున్నారు.