ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ ఇకలేరు
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మరణించిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, వైద్యులు దృవీకరించారు. కాగా.. కాలేయ సంబంధ వ్యాధితో పాటు ఒక్కసారిగా కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. వెంటిలేటర్‌పై వేణుమాధవ్‌కు చికిత్స తీసుకుంటుండగా ఆయన మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి.
వేణుమాధవ్ ట్రాక్ రికార్డ్!
ఇదిలా ఉంటే.. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్ర వేసుకున్న ఈయన.. తెలుగులో 300లకు పైగా చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. సూర్యపేట జిల్లా కోదాడలో 1979 డిసెంబర్ 30న వేణుమాదవ్ జన్మించారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన వేణుమాదవ్... ‘తొలిప్రేమ’, ‘దిల్’, ‘పోకిరి’, ‘లక్ష్మి’, ‘సై’, ‘ఛత్రపతి’ వంటి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు.
నటించడమే కాదు నిర్మాతగా..!
ఇదిలా ఉంటే.. వేణుమాధవ్ దాదాపు నాలుగువందల చిత్రాలలో నటించారు. ‘హంగామా’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తానే నిర్మాతగా, కథానాయకుడిగా ‘భూకైలాస్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాలు నిర్మించుకున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లోనూ పనిచేశారు. కోదాడకు చెందిన వేణుమాధవ్ హైదరాబాద్ మౌలాలీలో స్థిరపడ్డారు. ఆయనకు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments