పెళ్లి పీట‌లెక్క‌నున్నక‌మెడియ‌న్‌...

  • IndiaGlitz, [Tuesday,October 23 2018]

ఇప్పుడంతా కామెడీ స్టైల్ సిచ్యువేష‌న‌ల్‌గా మారింది. అందుక‌నే కొత్త కొత్త కమెడియ‌న్స్ సంద‌డి చేస్తున్నారు. వారిలో రాహుల్ రామ‌కృష్ణ ఒక‌రు. కేవ‌లం కామెడీతోనే .. అవ‌స‌రమైతే భ‌ర‌త్ అనే నేను చిత్రంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా న‌టించి ఆక‌ట్టుకున్నాడు.

ల‌ఘు చిత్రాల నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రామ‌కృష్ణ 'అర్జున్‌రెడ్డి'తో క‌మెడియ‌న్ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ..బ్రేక్‌ను సంపాదించుకున్నారు. చాలా సినిమాల్లో న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఈయ‌న ఈరోజు ట్విట్ట‌ర్ అకౌంట్‌లో.. త‌న పెళ్లి విష‌యాన్ని తెలియ‌జేశారు.

అమ్మాయి ఎవ‌ర‌నే విష‌యాన్ని చెప్ప‌లేదు కానీ.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 15న పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు తెలిపారు రాహుల్ రామ‌కృష్ణ. ఆయ‌న్ను సోష‌ల్ మీడియాలో ఫాలో అవుతున్న వారంద‌రూ అభినంద‌న‌లు చెబుతున్నారు.