పవన్ కి గుడి కట్టిస్తానంటున్న కమెడియన్..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో చిరు తమ్ముడు గా తెలుగు తెరకు పరిచయమై...అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు. యూత్ లో, మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు... పవన్ కోసం ఏదైనా చేసేస్తాం అనేలా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే...పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఏకంగా ఆయనికి గుడే కట్టించేస్తానంటున్నాడు ఓ కమెడియన్. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరనుకుంటున్నారా...జబర్ధస్త్ కామెడీ షోలో తనదైన నటనతో కడుపుబ్బా నవ్విస్తూ బాగా పాపులర్ అయిన షకలక శంకర్. శ్రీకాకుళంలో జబర్ధస్త్ శంకర్ పవన్ కళ్యాణ్ కి గుడి కట్టించాలనుకుంటున్నాడట. సర్ధార్ గబ్బర్ సింగ్ లో షకలక శంకర్ కి పవన్ అవకాశం ఇచ్చాడట. దీంతో పవన్ కి గుడి కట్టించి తన అభిమానాన్ని చాటేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com