కమెడియన్‌ సునీల్‌కు అస్వస్థత.. అసలేం జరిగింది!?

  • IndiaGlitz, [Thursday,January 23 2020]

టాలీవుడ్ కమెడియన్, హీరో సునీల్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన.. హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో అత్యవసర వైద్యం తీసుకుంటున్నారు. కాగా.. ఆయన లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. లాంగ్ గ్యాప్ తర్వాత సునీల్ మళ్లీ టాలీవుడ్‌లో మంచి మంచి పాత్రల్లో నటిస్తూ మళ్లీ క్రీజులోకి వస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ చిత్రం ‘అల వైకుంఠపురములో’ సునీల్ నటించి మెప్పించారు. అంతేకాదు.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న ‘డిస్కో రాజా’ లో కూడా  సునీల్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ‘డిస్కో రాజా’ జనవరి-24న విడుదలకు కానుంది.

More News

'22' చిత్రం నుండి హీరోయిన్‌ సలోని మిశ్రా ఫస్ట్‌లుక్ గ్లింప్స్ విడుద‌ల‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, సూపర్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి వద్ద దర్శకత్వ శాఖలో

టాలెంట్‌తో మెప్పిస్తున్న సుకుమార్ కుమార్తె

బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ పుట్టిన‌రోజు జ‌న‌వ‌రి 11. ఆరోజు సుకుమార్ కుమార్తె సుకృతి ఆయ‌న‌కు త‌న పాట పాడి ..

'ఎఫ్ 2' సీక్వెల్ లో మ‌రో స్టార్ హీరో

గ‌త ఏడాది ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎఫ్ 2`. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా

విడాకుల‌పై స్పందించిన శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌

తెలుగులో కొత్త బంగారు లోకంలో హీరోయిన్‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బెంగాళీ బ్యూటీ శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌.

అనంతపురంలో ప్రారంభమైన వెంకటేష్ మూవీ 'నారప్ప'

'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం 'నారప్ప' రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది.