Rahul Ramakrishna:'అసలు గొడవేంటీ' .. అనసూయ - విజయ్ దేవరకొండ మధ్యలో దూరిన రాహుల్ రామకృష్ణ

  • IndiaGlitz, [Thursday,May 11 2023]

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, స్టార్ యాంకర్ అనసూయ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి టైం నుంచి వున్న ఈ విభేదాలు తాజాగా మరోసారి రేగాయి. తాజాగా బుధవారం అనసూయ రెండు పోస్ట్ పెట్టి మళ్లీ కెలికారు. ఓ వీడియో బైట్ విడుదల చేసిన జబర్దస్త్ యాంకర్ .. విజయ్ ఫ్యాన్స్‌ని చేతకాని వాళ్లు , అదుపు తప్పారంటూ ఓ రేంజ్‌లో ఏసుకున్నారు. మధ్యలోకి మీడియాను లాక్కొస్తూ.. ధైర్యం వుంటే నిజాలు రాయాలంటూ ఫైర్ అయ్యారు.

అడిగాడా.. కౌంటరిచ్చాడా :

ఆ వెంటనే చేసిన మరో ట్వీట్‌లో ‘నువ్వు నన్ను తిడితే.. నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను. నా పెంపకం గర్వించదగినది. నా ఓపీనియన్‌ని ధైర్యంగా, గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి. అవమానించినవారు సిగ్గుపడాలి. అవమానించబడినవారు కాదు’ అంటూ అనసూయ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అనసూయ vs విజయ్ దేవరకొండ అభిమానుల వివాదం మధ్యలోకి విజయ్ స్నేహితుడు కమెడియన్ రాహుల్ రామృష్ణ వచ్చారు. మధ్యలో కలగజేసుకుంటున్నందుకు క్షమించాలి.. క్యూరియాసిటీతో అడుగుతున్నా, ఇంతకీ ఈ గొడవేంటీ అని ప్రశ్నించారు. అయితే రాహుల్ రామకృష్ణ ప్రశ్నలకు అనసూయ ఇంకా స్పందించలేదు. దీంతో ఆమె ఎలా రియాక్ట్ అవుతారోనని ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు .

అర్జున్ రెడ్డి సమయంలో విజయ్ దేవరకొండ vs అనసూయ :

ఇకపోతే.. తొలి నుంచి స్టార్ హీరో విజయ్ దేవరకొండకు, అనసూయకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అర్జున్ రెడ్డి సినిమా సమయంలో విజయ్ ఇచ్చిన స్పీచ్‌పై రంగమ్మత్త గరమైంది. మహిళల మనోభావాలు దెబ్బతినేలా విజయ్ మాట్లాడారంటూ ఏకంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయితే దీనిపై విజయ్ అభిమానులు, నెటిజన్లు భగ్గుమన్నారు. బూతులు , డబుల్ మీనింగ్ డైలాగ్స్ వుండే జబర్దస్త్‌కు యాంకరింగ్ చేస్తూ.. సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేసే నీకు మాట్లాడే అర్హత లేదంటూ అనసూయను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసేవారు. ఆ తర్వాత వివాదం సద్దుమణగగా.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘‘లైగర్’’ సినిమా ఫ్లాప్ కావడంతో అనసూయ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. దీంతో మరోసారి విజయ్ అభిమానులకు అనసూయ టార్గెట్ అయ్యారు. అప్పుడు కూడా ఈ వివాదం కొద్దిరోజులు నడిచిచింది.

విజయ్ పేరుకు ముందు ‘‘THE’’ వున్నందుకు రెచ్చిపోయిన రంగమ్మత్త :

తాజాగా మరోసారి విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేసింది అనసూయ. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ - సమంత నటిస్తోన్న చిత్రం ‘‘ఖుషి’’. ఈ సినిమాలోని తొలి పాటను ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ పేరుకు ముందు ‘‘THE’’ అని వుంటుంది. అది చూసిన అనసూయ రెచ్చిపోయింది. ‘‘ఇప్పుడే ఒకటి చూశాను... ‘‘ది’’నా..? బాబోయ్.. పైత్యం, ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం..’’ అని ట్వీట్ చేసింది. మరి విజయ్ అభిమానులు కామ్‌గా ఊరుకుంటారా అనసూయను ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ఈ ట్రోలింగ్‌పైనా అనసూయ సెటైరికల్‌గా ట్వీట్ చేసింది. ‘‘భలే రియాక్ట్ అవుతున్నార్రా దొంగ.. వూప్స్.. బంగారు కొండలంట.. ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తాను అన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు.