కొడుకుని పరిచయం చేసిన రాహుల్ రామకృష్ణ.. బిడ్డకి ఆయన పేరు, భలేగా వుందే
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో నటుడిగా, కమెడియన్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ రామకృష్ణ. షార్ట్ ఫిలింస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆయనకు అర్జున్ రెడ్డి తర్వాత దశ తిరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో వరుస ప్రాజెక్ట్‌ల్లో అవకాశాలు దక్కించుకుంటూ వస్తున్నారు. ‘భరత్ అనే నేను’, ‘చిలాసౌ’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’, ‘జాతిరత్నాలు’, ‘నెట్’, ‘స్కైలాబ్’ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా రాహుల్:
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌లోనూ రాహుల్.. ఓ కీలక పాత్ర సొంతం చేసుకున్నారంటే ఆయన క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. జాతిరత్నాలు సూపర్‌హిట్ కావడంలో రాహుల్ పాత్ర ఎంతో వుంది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టితో సమానంగా నవ్వించాడు. ‘‘ నా వల్లే ప్రాబ్లం అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ ’’ ఆయన చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారు రాహుల్. తన సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులకు పంచుకుంటూ వుంటారు.
ఫేమస్ రైటర్ పేరును బిడ్డకి పెట్టిన రాహుల్:
ఇకపోతే.. ఈ ఏడాది సంక్రాంతికి రాహుల్ రామకృష్ణ తండ్రైన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఇలా అన్నింటిని గోప్యంగా వుంచిన ఆయన గతేడాది నవంబర్‌లో తాను తండ్రిని కాబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. దీని నుంచి తేరుకునేలోపే.. సంక్రాంతి రోజున తనకు పండంటి బాబు పుట్టాడని రాహుల్ ట్వీట్ చేశారు. తాజాగా కుమారుడి పేరు విషయంలోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. కొడుక్కి వెరైటీ పేరు పెట్టాడు. “మీట్ మై సన్. హిజ్ నేమ్ ఈజ్ రూమి,” అంటూ కొత్త పోస్ట్ పెట్టాడు. తన కొడుకు ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ‘‘రూమి’’ అంటూ ఇరాన్‌కు చెందిన 13వ శతాబ్ధపు కవి. చిన్న చిన్న కొటేషన్లలా వుండే ఆయన కవితలు జనాలను నేరుగా తాకుతాయి. స్వతహాగా సాహిత్యంపై మంచి పట్టున్న రాహుల్ రామకృష్ణ.. ఈ క్రమంలోనే కుమారుడికి రూమి అనే పేరు పెట్టాడు. తన భార్యా కుమారుడితో ఉన్న ఫోటోను రాహుల్ షేర్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆ బాబును ఆశీర్వదిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout