నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
- IndiaGlitz, [Friday,April 10 2020]
తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటిలేటర్‌పై ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగింది!?
కాగా.. గురువారం తెల్లవారు జామున ప్రమాదవశాత్తు ఇంట్లో స్టెప్స్ పైనుంచి కింద పడ్డాడని తెలుస్తోంది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో అప్రమత్తమైన కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. తల భాగంలో తీవ్ర గాయం కావడంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని నర్సింగ్ కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు సమాచారం అందుకున్న సినీ ప్రముఖులు, ఆప్తులు, పలువురు నటులు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని ధైర్యం చెప్పారని తెలుస్తోంది.
కాగా.. నర్సింగ్ యాదవ్ 25 ఏళ్లుగా సినిమాల్లో నటించి మెప్పిస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా తనదైన ముద్రవేసుకున్నారు. మరీ ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిత్రమైన ‘క్షణం క్షణం’ నర్సింగ్ యాదవ్‌కు మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే.