హాస్యనటడు గుండు హనుమంతరావు కన్నుమూత
- IndiaGlitz, [Monday,February 19 2018]
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు ఈరోజు ఉదయం మూడున్నర గంటలకు ఎస్.ఆర్.నగర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. సత్యగ్రహం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన అహనా పెళ్లంట, కొబ్బరిబోండాం, మాయలోడు, యమలీల, వినోదం సినిమాలతో మంచి హస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ సీరియల్స్‌లో నటించారు.
ఆయన నటించిన అమృతం సీరియల్ అత్యంత ప్రేక్షకాదరణ దక్కించుకోవడమే కాదు.. ఆయనకు నంది అవార్డును కూడా తెచ్చిపెట్టింది. 400పైగా చిత్రాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వింఛఙణ గుండు హనుమంతరావు మరణం పట్ల టాలీవుడ్ పరిశ్రమ తమ సంతాపాన్ని తెలియజేసింది.