హాస్యనటుడు అలీకి మాతృవియోగం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ హాస్యనటుడు అలీకి మాతృవియోగం కలిగింది. అలీ తల్లి జైతన్ బీబీ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. బుధవారం సాయంత్రం రాజమండ్రిలోని అలీ సోదరి నివాసంలో జైనత్ బీబీ కన్ను మూశారు. రాంచీలో ఓ సినిమా షూటింగ్ లో ఉన్న అలీ...తల్లి మరణవార్త విని హూటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరారు. కాగా... జైతన్ పార్ధివదేహాన్ని హైదరాబాద్ కు తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు. సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ... తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రేమ వల్లే ఈ స్థాయికి ఎదిగానని చాలా సందర్భాల్లో తెలిపారు. తన తండ్రి పేరిట అనేక సేవకార్యక్రమాలు చేపట్టిన అలీ.... తన తల్లితో గడిపేందుకు చాలా ఇష్టపడేవారు. కాగా... అలీ మాతృవియోగంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments