తండ్రి కలను నిజం చేసిన అలీ కూతురు.. మురిసిపోతున్న కుటుంబం, ఫ్యాన్స్ విషెస్
Send us your feedback to audioarticles@vaarta.com
పిల్లలు పుట్టగానే సరిపోదు.. వాళ్లు పెరిగి ప్రయోజకులై , వారి గురించి నలుగురూ చెబితే వినాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. ఈ క్షణం కోసం పేరెంట్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈ అనుభూతినే ఆస్వాదిస్తున్నారు కమెడీయన్ అలీ. వివరాల్లోకి వెళితే.. సీతాకోక చిలుక' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలీ.. దాదాపు 1100కు పైగా చిత్రాల్లో నటించి స్టార్ కమెడీయన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు కమెడియన్‌గా రాణిస్తూనే కొన్ని సినిమాల్లో హీరోగానూ చేసి ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై వ్యాఖ్యాతగానూ రాణిస్తున్నారు.
ఇకపోతే.. ఆయనకు ముగ్గురు పిల్లలన్న సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు కాగా ..ఇంకొకరు అబ్బాయి . వాళ్ళ పేర్లు ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా. సినిమాలు, షూటింగ్‌లు లేకపోతే కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు కేటాయిస్తారు అలీ. ఎక్కడికి వెళ్లినా ఆ సంగతులను పంచుకుంటూ వుంటారు. మొన్నామధ్య ఆయన సతీమణి జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి.. అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలో తన కూతురు ఫాతిమా గురించి ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు అలీ. అదేంటంటే ఫాతిమా డాక్టర్ అయ్యిందట. ఇది అలీ కోరిక అని.. తన కూతురి ద్వారా ఈ కోరిక తీరినట్టు హర్షం వ్యక్తం చేశారు . ఈ విషయంపై ఫాతిమా కూడా గర్వంగా ఫీలవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అలీ కుటుంబానికి, ఫాతిమాకు అభినందలు తెలియజేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments