దిక్కుతోచని స్థితిలో కమెడియన్ అలీ!
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ అలీ రాజకీయాల్లో రాణించాలని తహతహలాడుతున్నాడు. ఇప్పటికే ఒకట్రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అలీ భంగపడి.. తిరిగి మళ్లీ సినిమాల్లోకి వచ్చేశాడు. అయితే త్వరలో ఎన్నికలు జరగనుండటంతో ఈ సారి మాత్రం ఆరు నూరైనా ఏదో ఒక పార్టీ తరఫున రాజకీయ అరగేంట్రం చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఒకానొక సమయంలో టీడీపీ టికెట్ వచ్చినట్లు వచ్చి మిస్సయిందని ఆయన అభిమానులు చెబుతుంటారు. అలా టీడీపీకి సపోర్టుగా ఉన్న ఆయన ఎప్పటికైనా తనకు టికెట్ ఇస్తుంది కదా అని వేయి కళ్లతో వేచి చూశాడు.. అయితే ఆ ఆశ మాత్రం ఇప్పటి వరకూ నెరవేరలేదు. టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్‌కు అలీ భక్తుడన్న విషయం తెలిసిందే. పవన్.. జనసేన పార్టీని స్థాపించడంతో రాజకీయంగా ఈసారైనా ఎదుగుతాన్లే అనే ఆశ మళ్లీ చిగురించింది.
తాజాగా.. వైసీపీ, జనసేన, టీడీపీ అధినేతలతో వరుస భేటీలవుతూ అలీ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రధాన పార్టీలైన అన్ని పార్టీల అధినేతలతో భేటీ అయిన అలీకి ఏ పార్టీ నుంచి స్పష్టమైన రాకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. మొదట వైఎస్ జగన్‌తో భేటీ అయిన అలీ.. వైసీపీ కండువా కప్పుతారని డేట్‌తో సహా పెద్ద ఎత్తున వార్తలు హల్ చల్ చేశాయి. అయితే ఆ భేటీలో ఏ విషయంలో చెడిందో ఏమోగానీ కొద్దిరోజుల గ్యాప్‌లోనే పవన్ దగ్గరికే వెళ్లిపోయాడు. దీంతో మళ్లీ దేవుడి దగ్గరికే వచ్చేశారని జనసేన అభిమానులు, కార్యకర్తలు అందరూ అనుకున్నారు. అయితే పవన్‌తో భేటీ అయిన కొద్దిసేపటికే మళ్లీ చంద్రబాబును కలవడం గమనార్హం. దీంతో అసలు అలీ మనసులో ఏముంది..? ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు..? అనేవి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.
పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా..!?
తన సొంతూరైన రాజమండ్రి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటును అలీ ఆశిస్తున్నాడు. ఈ విషయమై నియోజకవర్గంలోని పలువురు పెద్దలను సంప్రదించగా రాజకీయ అరగేంట్రం చేస్తే మేలు జరుగుతుందనే చెప్పారట. అందుకే అప్పట్నుంచి ఆయన పార్టీల బాట పట్టారని.. వైసీపీ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో చేసేదేమీ లేక మళ్లీ జనసేనాని దగ్గర వచ్చి వాలాడు. అయితే అలీ అడిగితే జనసేన నుంచి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటివ్వడానికి మరుక్షణం ఆలోచించకుండానే ఇచ్చేస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒకవేళ జనసేన నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఏంటి..? అసలు పోటీ చేద్దామా వద్దా...? అని దిక్కుతోచని స్థితిలో అలీ.. ఉండిపోయారట! ఎన్నికల్లో పోటీ అసెంబ్లీ లేదా పార్లమెంట్ గడప తొక్కాలనుకుంటున్న అలీ కల ఈసారైనా ఫలిస్తుందా లేకుంటే కల్లలవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments