యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా 'కొలంబస్'
Send us your feedback to audioarticles@vaarta.com
లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం 'కొలంబస్'. 'డిస్కవరీ ఆఫ్ లవ్' అనేది ఉపశీర్షిక.ఆర్. సామల దర్శకునిగా పరిచయమవుతున్నారు. మంచి చిత్రాలు నిర్మించాలనే ఆకాంక్షతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అశ్వనీ కుమార్ సహదేవ్ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఓ వైవిధ్యభరితమైన కథను ఎన్నుకున్నారు. తమ సంస్థకు మంచి పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు.. సుమంత్ అశ్విన్ సక్సెస్ పరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీ కుమార్ సహదేవ్ మాట్లాడుతూ - ''ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. ప్రతి అమ్మాయి, అబ్బాయి ఐడెంటిఫై చేసుకునే విధంగా ఇందులో హీరో, హీరోయిన్ పాత్రలు ఉంటాయి. అలాగని, కేవలం యూత్ మాత్రమే చూసేలా ఉండదు. అన్ని వర్గాలవారికీ నచ్చుతుంది. ఇందులో సుమంత్ అశ్విన్ క్యారెక్టర్ చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. సుమంత్ అశ్విన్ సక్సెస్ పరంపరంను కొనసాగించే చిత్రం ఇది. ఈ చిత్రంలో ఉన్న ఆరు పాటలకు జితిన్ మంచి స్వరాలందించారు. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నాం. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. రీ-రికార్డింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. డీటీయస్ కార్యక్రమాలు మొదలుపెట్టాం. మా సంస్థ ద్వారా వస్తున్న ఈ తొలి చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
సుమంత్ అశ్విన్ సరసన సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జితిన్, కెమెరా: భాస్కర్ సామల, ఎడిటింగ్: కె.వి. కృష్ణారెడ్డి, కో-డైరెక్టర్: ఇంద్ర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments