కొలంబస్ మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
దసరాకు విడుదలైన మూడు సినిమాల్లో యూత్‌ఫుల్ లవ్ జోనర్లో విడుదలైన సినిమా కొలంబస్. ప్రేమకోసం వెతికే ఓ ప్రేమికుడి కథే కొలంబస్. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన తెచ్చుకుంది? సుమంత్ అశ్విన్‌కు ఈ సినిమా ఎలాంటి సినిమా అవుతుంది? తెలుసుకోవాలంటే ఓ లుక్కేద్దాం.
కథ
అశ్విన్ (సుమంత్ అశ్విన్)కి కబడీ అంటే ఇష్టం. ప్రేమలో పడి అతను ఇంజనీరింగ్‌లో అరియర్స్ పెట్టుకుంటాడు. అది అతని ప్రేయసి ఇందు (మిస్తీ చక్రబర్తి)కి నచ్చదు. ఆమె అతన్ని త్వరగా అరియర్స్ పూర్తి చేయమని చెబుతుంది. మాస్టర్స్ చేయడానికి ఢిల్లీ వెళ్తుంది. మాస్టర్స్ చేశాక యు.ఎస్.లో ఉద్యోగంలో స్థిరపడుతుంది. కానీ ఇంతలో జైలుకి వెళ్తాడు అశ్విన్. జైలు నుంచి వచ్చిన అశ్విన్ ఇందు కోసం వెతుకుతాడు. లక్కీగా అతనికి నీరూ ఆపీసులో ఇందు చేరిందన్న విషయం తెలుస్తుంది. నీరు (సీరత్ కపూర్)తో ఇందు కోసం పరిచయం పెంచుకుంటాడు అశ్విన్. నీరూకి కూడా తను సాయం చేస్తాడు. అశ్విన్ నీరూకి చేసిన సాయం ఎలాంటిది? అశ్విన్ అసలు జైలుకు ఎందుకు వెళ్లాడు? అతన్ని జైలుకు పంపిందెవరు? ఇందుకు ఎందుకు దూరమయ్యాడు? వంటివన్నీ తెలుసుకోవాలంటే రెండో సగం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
సుమంత్ అశ్విన్ నటన పరంగా తన గతచిత్రాలతో పోల్చితే మెచ్చూర్డ్ గా నటించాడు. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. రొమాంటిక్ సీన్స్ చేసే విషయంలో అశ్విన్ మెరుగ్గా నటించాడు. మిస్తీ తన పాత్రకు తగిన విధంగా న్యాయం చేసింది. సినిమాలో లుక్స్ పరంగా చాలా అందంగా కనపడింది. సీరత్ విషయానికి వస్తే, హీరోకు సపోర్ట్ చేసే క్యారెక్టర్. పెర్ ఫార్మెన్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా బాగానే చేసింది. కొన్ని సీన్స్ లో బొద్దుగా కనపడింది. భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్ ను ఫ్రెష్ గా చూపించాడు. సెకండాఫ్ బావుంది.
మైనస్ పాయింట్స్
దర్శకుడు రాసుకున్న పాయింట్ మంచిదే కానీ దాని చుట్టూ అల్లుకున్న కథ గ్రిప్పింగ్ గా అనిపించలేదు. జితిన్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు సరికదా, మధ్య మధ్యలో పాటలు వచ్చి కథను సైడ్ ట్రాక్ పట్టించేసినట్టు ఉంటాయి .బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడానే బావుంది. ఫస్టాఫ్ నార్మల్ గానే ఉంటుంది.
విశ్లేషణ
ఇంతకు ముందు చెప్పిన విధంగా దర్శకుడు ఆర్.సామల రాసుకున్న కథ గ్రిప్పింగ్ గా లేదు. కథ అంతా మనకు తెలిసినలాగానే అనిపిస్తుంది. ఎమోషన్స్ కూడా పెద్దగా అనిపించవు. సప్తగిరి కామెడి ఆకట్టుకోలేదు. అక్కడక్కడా లాజిక్ మిస్సయినట్టు అనిపించింది. నాగినీడు, రోహిణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాలో కొత్తగా చెప్పిందేమీ లేకున్నా సినిమాను ఒకసారి చూడవచ్చు.
బాటమ్ లైన్: కొలంబస్ ప్రేమను వెతుక్కోవడం తప్ప కొత్తగా కనుగొన్నదేం కనపడలేదు
రేటింగ్: 2.25/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com