'కొలంబస్' కి.. 'స్టూడెంట్ నెం.1'కి లింకేంటీ?
Send us your feedback to audioarticles@vaarta.com
సుమంత్ అశ్విన్ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం 'కొలంబస్'. ఈ సినిమా రేపు థియేటర్లలో సందడి చేయనుంది. 'కేరింత' వంటి హిట్ చిత్రం తరువాత సుమంత్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని ఓ పాయింట్ ఎన్టీఆర్ నటించిన 'స్టూడెంట్ నెం.1' సినిమాలోని పాయింట్‌ని గుర్తు తెస్తోంది.
అదేమిటంటే.. 'స్టూడెంట్ నెం.1'లో ఎన్టీఆర్ జైలులో ఉంటూనే తన లా చదువుని కొనసాగిస్తే.. 'కొలంబస్'లో కూడా సుమంత్ జైలులో ఉంటూనే ఇంజనీరింగ్ పూర్తిచేయడం. ఈ పాయింట్ మాత్రం కామనే అయినా.. సినిమాలు మాత్రం వేటికవే విభిన్నంగా కనిపిస్తున్నాయి. మరి స్టూడెంట్ నెం.1 తరహాలో కొలంబస్ కూడా విజయం సాధిస్తుందా? చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments