68th National Film Awards: ఉత్తమ తెలుగు చిత్రంగా ‘‘కలర్ ఫోటో’’... బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘థమన్’

2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. అయితే ఈసారి బెస్ట్ క్రిటిక్ అవార్డ్ ఎవరికీ లేదని కేంద్రం తెలిపింది. ఫిల్మ్ మేకర్ విపుల్ షా నేతృత్వంలోని 10 మంది సభ్యుల జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది. 30 భాషలకు చెందిన సినిమాలు 50 కేటగిరీలలో 300 ఫీచర్ ఫిల్మ్‌లు, 150 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లు అవార్డుల కోసం పోటీపడ్డాయి.

ఇందులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’ నిలిచింది. సందీప్ రాజ్ దర్శకత్వంలో సుహాస్, చాందిని చౌదరి జంటగా నటించారు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘తరగతి గదిలోనా’ పాట యువతను ఉర్రూతలూగించింది. ఇక జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ నిలిచారు. అల వైకుంఠపురం చిత్రానికి గాను ఈయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించారు.

అటు నాట్యం సినిమాకు గాను రెండు జాతీయ ఉత్తమ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి పనిచేసిన టీవీ రాంబాబుకు బెస్ట్ మేకప్ మెన్‌గా, సంథ్యా రాజుకు బెస్ట్ కొరియోగ్రఫర్‌గా అవార్డులు దక్కాయి.

More News

Lal Singh Chadda: 'లాల్ సింగ్ చెడ్డా' నుంచి నాగ చైతన్య లుక్ విడుదల

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లాల్ సింగ్ చెడ్డా.

Janasena : జగన్‌వి గొప్పలే.. 10 శాతం కూడా భూసేకరణ కాలేదు : రామాయపట్నం పోర్ట్ నిర్మాణంపై నాదెండ్ల వ్యాఖ్యలు

రామాయపట్నం పోర్టు నిర్మాణంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.

Janasena : సీక్రెట్‌గా ఆ డీల్, రామాయపట్నంపై ఎన్నో అనుమానాలు.. జగన్ సమాధానం చెప్పాల్సిందే: నాదెండ్ల

కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఉన్న ఎమ్.ఓ.యు.ని ముఖ్యమంత్రి ఎందుకు గోప్యంగా ఉంచారని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

Parampara Season 2: 'పరంపర' సీజన్ 2ను ఎంజాయ్ చేస్తున్నారు - శరత్ కుమార్

డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్,

Janasena : సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్.. కొందరిపై ఎందుకీ వివక్ష : నాదెండ్ల మనోహర్

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ప్రకటనలో రాష్ట్రప్రభుత్వం కొంతమంది ఉద్యోగుల పట్ల వివక్ష వైఖరి కనబరుస్తోందని ఆరోపించారు