Colors Swathi:అన్నీ ఆ పాత్రలే వచ్చేవి.. ఆ సినిమా టైంలో నాపై రూమర్స్ : కలర్స్ స్వాతి హాట్ కామెంట్స్
- IndiaGlitz, [Thursday,May 18 2023]
టాలీవుడ్లో సత్తా చాటిన తెలుగు అమ్మాయిలు చాలా తక్కువనే చెప్పాలి. ఎప్పుడు చూసినా నార్త్, కర్ణాటక, కేరళ అమ్మాయిలే తెలుగు తెరపై హీరోయిన్లు. నిర్మాతలు కూడా లోకల్ టాలెంట్‌ను పక్కనపెట్టి.. ఇతర రాష్ట్రాల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో కలర్స్ స్వాతి వంటి వారు వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత యాంకర్‌గా పరిచయమైన ఈ ముద్దు గుమ్మ.. తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే చాలా రోజుల తర్వాత ఆమె ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. స్వాతి నటించిన ‘‘మంత్ ఆఫ్ మధు’’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను కలర్స్ స్వాతి పంచుకున్నారు.
డేంజర్ సినిమా సమయంలో రూమర్స్:
కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని చెప్పింది. విక్టరీ వెంకటేశ్ నటించిన ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రంలో త్రిష చెల్లిగా చేశానని.. ఆ సినిమాతో తనకు మంచి పేరు వచ్చిందని, కానీ తర్వాత అచ్చం అదే తరహా క్యారెక్టర్లు రావడంతో వాటిని తిరస్కరించానని స్వాతి చెప్పారు. దీంతో కెరీర్ డౌన్ అవుతుందని భయపడ్డానని.. కానీ ఓ మంచి హిట్‌తో ఉపశమనం లభించేదని ఆమె గుర్తుచేశారు. ఇక రూమర్స్‌పై స్వాతి స్పందిస్తూ.. డేంజర్ సినిమా చేసినప్పుడు ఎన్నో పుకార్లు వచ్చాయని కానీ వాటిని తాను పట్టించుకోలేదని తెలిపింది.
ఇకపోతే.. మంత్ ఆఫ్ మధు సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, స్వాతి, శ్రేయ, వైవా హర్షా నటిస్తున్నారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.