'కలర్ ఫోటో' పూజా కార్యక్రమాలతో ప్రారంభం !!!

  • IndiaGlitz, [Wednesday,January 08 2020]

హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరో పరిచయం కాబోతున్నాడు. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా, ఏజెంట్ ఆత్రేయ సాయి శ్రీనివాస్ చిత్ర దర్శకుడు స్వరూప్ క్లాప్ కొట్టారు. స్క్రిప్ ను సునీల్ అందించిన ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, గోపి మోహన్, పవన్ సాదినేని, నిర్మాత రాహుల్ యాదవ్ పాల్గొన్నారు.

యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 1995 లో ఒక ఇంజనీరింగ్ కాలేజి లో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది.

More News

'పలాస 1978' తెలుగు లో అసురన్ అవుతుంది.. దర్శకుడు మారుతి

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’ .

చిరు ఆ మాట అన్నప్పుడు నాకు పదింతల మర్యాద..: విజయశాంతి

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై

'నా పేరు  రాజా' టీజ‌ర్ లాంచ్‌!!

అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్  హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో

ఘోర విమాన ప్రమాదం.. 170 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఇవాళ రెండు ఘోర ఘటనలు జరిగాయి. బుషెహర్ అణు కర్మాగారం సమీపంలో ఇవాళ భూకంపం చోటుచేసుకుంది.

‘జర్నీ’ మూవీలో లాగా ఘోర ప్రమాదం.. 36 మందికి తీవ్రగాయాలు

‘జర్నీ’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది కదూ.. ఈ సినిమా ఒక్కసారి చూస్తే చాలు కనెక్ట్ అయిపోతుంది.