నూతన నటీనటులతో కాలేజీ డేస్ చిత్రం ప్రారంభo
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ లత సినీ క్రియేషన్స్ పతాకం పై పి. ఈశ్వర్ రావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బెక్కం రవీందర్ ప్రొడక్షన్ కంట్రోలర్ గా శ్రీ లత నిర్మిస్తున్న చిత్రం కాలేజ్ డేస్. నూతన నటి నటులతో యూత్ ఫుల్ కథాంశం తో రూపొందుతున్న చిత్రం కాలేజ్ డేస్. గౌతమి పుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ దగ్గర పలు చిత్రాలకు కో-డైరెక్టర్ గా పని చేసిన రజినీకాంత్ . ఎన్నా ఈ చిత్రానికి దర్శకుడిగా వేవహరిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు (జూన్ 21) హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనం గా ప్రారంభం అయింది.
పూజా కార్యక్రమాల అనంతరం తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చిత్ర బృందానికి స్క్రిప్ట్ ను అందించారు. ముహూర్తపు సన్నివేశానికి మల్కాపురం శివ కుమార్ క్లాప్ ఇవ్వగా పటేల్ కెమెరా స్విచ్చాన్ చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీ లత మాట్లాడుతూ " మా శ్రీ లత సినీ క్రియేషన్స్ బ్యానర్ లో ఇది రెండో సినిమా . మొదటి చిత్రం ఫస్ట్ కాపీ రెడీ గా ఉంది త్వరలో ఆ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఈ చిత్రం ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. కథ చాల బాగుంది. అందరు కొత్త వాళ్ళతో ఒక కాలేజీ బ్యాక్ డ్రాప్ లో మంచి మెస్సేజ్ తో యూత్ ని ఆకట్టుకునే విధంగా నిర్మిస్తున్నాం".
దర్శకుడు రజినీకాంత్ . ఎన్నా మాట్లాడుతూ " డైరెక్టర్ క్రిష్ గారి బ్యానర్ లో చాల టీవీ ప్రోగ్రాం కి నేను కో-డైరెక్టర్ గా పని చేశాను. వారు చేసిన కొని సినిమాలకి నేను కో-డైరెక్టర్ గా కూడా పని చేశాను. వారి బ్యానర్ లోనే ఒక్క సినిమా కి నాకు దర్శకత్వ అవకాశం ఇచ్చారు కానీ కొన్ని కారణాల వాళ్ళ సినిమా చేయడం కుదరలేదు . ఇప్పుడు నిర్మాత శ్రీ లత గారు నా కథ నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాల థాంక్స్ . నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని ప్రారంభించాం . జులై మొదటి వారం లో హైదరాబాద్ పరిసరప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది . త్వరలోనే నటీనటుల వివరాలు తెలియచేస్తాం ".
తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ "తెలంగాణ ఆంధ్రా స్టూడెంట్స్ టాపిక్ తో వస్తున్నా చిత్రం ఈ కాలేజీ డేస్. ఒక హ్యాపీ డేస్ లాంటి గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను "
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments