Collector Gunman:సిద్ధిపేటలో దారుణం.. భార్య, పిల్లలను చంపి కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య
Send us your feedback to audioarticles@vaarta.com
సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. భార్య, ఇద్దరు పిల్లలను చంపి కలెక్టర్ గన్మెన్ తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్ద గన్మెన్గా పని చేస్తున్న ఆకుల నరేష్.. చిన్నకోడూర్లోని రామునిపట్లలో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీతో కలిసి ఉంటున్నారు. అయితే ఇవాళ విధులకు వెళ్లకుండా భార్య, ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నారు.
విధులకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా.? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకం రేగింది.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య
— DONTHU RAMESH (@DonthuRamesh) December 15, 2023
భార్య ఇద్దరు పిల్లల్ని చంపేసి గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న నరేష్
చిన్నకొడూర్ మండలం రాముని పట్లలో ఘటన pic.twitter.com/GnmC5Khwmc
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com