చిరంజీవికి సీఎం జగన్ కృతజ్ఞతలు.. క్రెడిట్ వారిదే!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ లో ఒక్కరోజులో 13 లక్షల మందికి పైగా రికార్డ్ స్థాయిలో వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించినందుకు గానూ జగన్ ప్రభత్వంపై ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ డ్రైవ్ పై కొన్ని వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం సాధించిన ఈ ఘనతని ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
జగన్ ఆదర్శవంతమైన నాయకత్వం వల్లే ఈ రికార్డ్ సాధ్యమైందని చిరంజీవి ప్రశంసించారు. చిరంజీవి ట్వీట్ కు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ స్పందించడం విశేషం. తమని అప్రిషియేట్ చేసిన చిరంజీవికి కృతజ్ఞతలు చెబుతూ జగన్ ట్వీట్ చేశారు.
'చిరంజీవి గారు.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మీ మంచి మాటలకు కృతజ్ఞతలు చెబుతున్నా. ఈ ఘనతకు కారణం గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశావర్కర్లు, మండల అధికారులు, జిల్లాస్థాయి అధికారులు, జాయిట్ కలెక్టర్లు, కలెక్టర్లు. క్రెడిట్ వారికే దక్కుతుంది. ఇది టీమ్ ఎఫర్ట్' అని జగన్ ట్విట్టర్ వేదికగా చిరంజీవికి రిప్లై ఇచ్చారు.
చిరంజీవి, జగన్ మధ్య గత కొంత కాలంగా మంచి సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఆ మధ్యన చిరంజీవి దంపతులు జగన్ ఇంటికి వెళ్లారు. వీరిద్దరి ఫ్రెండ్ షిప్ పై పొలిటికల్ గా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
@KChiruTweets Garu, on behalf of the state government, I thank you for your kind words of appreciation. Credit goes to the team effort by the Village/Ward Secretariats, Volunteers, ANMs, ASHA workers, PHC doctors, Mandal Officers, District Officers, JCs & Collectors.
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout