OWK 2nd Tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభించిన సీఎం జగన్.. జాతికి అంకితం..
Send us your feedback to audioarticles@vaarta.com
రాయలసీమ ప్రజల చిరకాల వాంఛన నెరవేర్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పనులను ప్రభుత్వం అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి పూర్తి చేయడంతో గాలేరు – నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమమైంది. గతంలో దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించగా టీడీపీ హయాంలో చంద్రబాబు సర్కారు కేవలం రూ.81.55 మాత్రమే కోట్లు ఖర్చు చేసింది. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.145.86 కోట్లతో రెండో టన్నెల్ పనులను పూర్తి చేశారు. అంతే కాదు 5.801 కిలోమీటర్ల పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ పొడవైన పనులను కూడా కంప్లీట్ చేశారు. ఇందు కోసం ఏకంగా రూ.934 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు టన్నెళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1,501.94 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది.
2.60 లక్షల ఎకరాలకు సాగు నీరు..
శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించేలా ప్రభుత్వం పనులు చేపట్టింది. దీని ద్వారా ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం దక్కింది. దివంగత సీఎం వైఎస్సార్ 2005లో గాలేరు – నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువకు కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు.
చంద్రబాబు ప్రభుత్వం విఫలం..
అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులను పూర్తి చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చాక పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేసింది. ఫలితంగా రెండు సొరంగాల ద్వారా 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చు. శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే రెండు టన్నెళ్లను పూర్తి అవగా మూడో టన్నెల్ కూడా పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది.
సీమను సుభిక్షం చేసిన వైఎస్సార్..
దివంగత సీఎం వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యుటేర్ సామర్థ్యాన్ని 9వేల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచారు. అలాగే గాలేరి-నగరి ప్రాజెక్ట్ చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేసి హంద్రనీవాను చేపట్టారు. గాలేరి-నగరి పనులను రూ.4,982.69కోట్లు ఖర్చు చేసి వరద కాలువతో పాటు గండికోట, వామికొండ, సర్వరాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలా వరకు పూర్తి చేశారు. అంతకుముందు 1995 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు రాయలసీమ ప్రజలకు తీరని ద్రోహం చేశారు. అలాగే విభజన అనంతరం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గాలేరు-నగరి పనులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో 2019 ఎన్నికల్లో సీమ ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పారు.
చిత్తశుద్ధితో పనులు పూర్తి..
అనంతరం అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రభుత్వం సీమలోని పెండింగ్ ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులను పూర్తి చేయడంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే పెన్నా డెల్లాలో భాగంగా నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి జాతికి అంకితం చేసిన సీఎం జగన్.. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ-నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న జాతికి అంకితం చేశారు. దీంతో రాయలసీమను సస్యశామలం తండ్రికొడుకులే ముందుకు రావడం వారికి ఆ ప్రాంత ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout