YSRCP: గ్రౌండ్‌లోకి దిగిన సీఎం జగన్.. గణనీయంగా పెరిగిన వైసీపీ గ్రాఫ్..
- IndiaGlitz, [Thursday,April 04 2024]
ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ దూసుకుపోతుంది. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాటే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు జనం బ్రహ్మారథం పడుతున్నారు. సొంత జిల్లా కడప నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు సీమలోని నాలుగు జిల్లాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రోడ్ షో ఆద్యంతం జనసంద్రాన్ని తలపిస్తూ సాగుతోంది. దారిపొడవునా మీవెంట నడిచేందుకు మేం సిద్ధమంటూ నినదిస్తున్నారు.
మరోవైపు సీఎం జగన్ కూడా ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమవుతూ వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. బస్సు యాత్రకు వస్తున్న రెస్పాన్స్‌తో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓవైపు వైసీపీకి జనం జేజేలు కొడుతుంటే.. మరోవైపు టీడీపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా రాయలసీమ నుంచి ప్రచారం ప్రారంభించినా ప్రజల్లో స్పందన లేదు. బాబు సభలకు జనం రాకపోవడంతో తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి జాకీలు పెట్టినా లేవలేని పరిస్థితిలో ఉంది.
దీనికి తోడు కూటమి నేతల మధ్య విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో వీడని చిక్కుముడులు కూడా చంద్రబాబును వెంటాడుతున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల ప్రచారానికే అస్వస్థత అంటూ విశ్రాంతి తీసుకున్నారు. దీంతో కూటమి నాయకుల్లో ఓటమి భయం మొదలైంది. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చేశారు. ఓడిపోయే దానికి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు ప్రచారం చేయడం అనుకుని చాలా చోట్లు సైలెంట్ అయిపోతున్నారు.
వైసీపీ అధినేత జగన్ 'మేమంతా సిద్ధం' యాత్రతో ప్రజల్లోకి వచ్చాక.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికలు సమీపించే కొద్దీ వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పెరుగుతోంది. ప్రజల్లో సీఎం జగన్‌కు ఉన్న ఆదరణ, పార్టీకి వస్తున్న స్పందన చూస్తుంటే పోలింగ్ నాటికి ఎలక్షన్ వార్ వన్ సైడ్ అయ్యేలా ఉంది. 2019 ఎన్నికల్లో కంటే ఈసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.