‘కలాం’ స్థానంలో ‘వైఎస్’ పేరు.. సీఎం జగన్ సీరియస్!
- IndiaGlitz, [Tuesday,November 05 2019]
మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డా. అబ్దుల్ కలాంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘోర అవమానం చేసిందని గత కొన్ని గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.
10వ తరగతి పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రతి ఏటా అబ్దుల్ కలాం పుట్టినరోజు నాడు ప్రతిభ అవార్డులు కింద విద్యార్థులకు ఇస్తారు. ఈ అవార్డులకు Dr. A. P. J Abdul kalam Pratibha Puraskar అని పేరు పెట్టడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ అవార్డులకు YSR Vidya Puraskar గా మార్చింది. అంతేకాదు..
ఇందుకు సంబంధించిన జీవోను సైతం విడుదల చేసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇదంతా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కే తెలిసే జరిగిందా..? లేకుంటే తెలియకుండానే జరిగిందా..? అనేది ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా.
సీఎం జగన్ సీరియస్..!
ఈ వ్యవహారం ప్రాంతీయ, జాతీయ మీడియాల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ప్రతిభా పురస్కారాలకు కలాం పేరు మార్పుపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. తన దృష్టికి తీసుకురాకుండా పేరు ఎలా మారుస్తారు..? అని వైఎస్ జగన్ కన్నెర్రజేశారు. సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. యథాతథంగా అబ్దుల్ కలాం పేరు పెట్టాలని, మరికొన్ని అవార్డులకు దేశంలోని మహనీయులపేర్లు కూడా పెట్టాలని ఆదేశించారు. గాంధీ, అంబేడ్కర్, పూలే, జగ్జీవన్‌రామ్ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు. మొత్తానికి చూస్తే.. ప్రభుత్వం ఒక మెట్టు వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. వివాదం ముదరక ముందే జగన్ అలెర్ట్ అయ్యి.. ఫుల్‌స్టాప్ పెట్టేశారని చెప్పుకోవచ్చు.