Yatra 2:సీఎం వైయస్ జగన్ బర్త్ డే స్పెషల్.. ‘యాత్ర 2‘ కొత్త పోస్టర్ విడుదల..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 'యాత్ర-2' మూవీ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో దివంగత వైఎస్సార్‌గా సీనియర్ హీరో మమ్ముట్టి కనిపించగా..జగన్‌గా తమిళ హీరో జీవా కనిపించారు. ఈ పోస్టర్‌ను వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎన్నికల ముందు ముందు విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జీవిత కథ ఆధారంగా ‘యాత్ర 2‘ పేరుతో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్రను ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రి ఎలా అయ్యారనేది ఈ సినిమా కథ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన 'యాత్ర 2' టైటిల్, మోషన్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా జగన్ జన్మదినం సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
కాగా యాత్ర 2' చిత్రాన్ని త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ‘యాత్ర’ సినిమా ఫిబ్రవరి 8, 2019లో విడుదల కాగా.. ‘యాత్ర 2’ ని కూడా అదే రోజు అంటే ఫిబ్రవరి 8, 2024న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం వైఎస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com