CM YS Jagan:సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సీఎం వైయస్ జగన్ బర్త్‌డే ఫొటో
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత సీఎం వైయస్ జగన్ పుట్టినరోజు అంటే పార్టీ శ్రేణులకు పెద్ద పండుగ లాంటిది. సంవత్సరంలోని అన్ని పండుగలు డిసెంబర్ 21వ తేదీనే వచ్చినట్లు జరుపుకుంటారు. తమ లీడర్ జన్మదినం వస్తుందంటే చాలు వారం రోజుల ముందే అభిమానులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో పాటు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది ఆయన బర్త్‌డేకి కామన్ డీపీని విడుదల చేస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా జగన్ జన్మదినం సందర్భంగా ఓ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ ఫొటో ప్రజలను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
విపరీతంగా ఆకట్టుకుంటున్న ఫొటో..
నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ.. వారిని తన సొంతవారిలా అక్కున చేర్చుకుంటున్నారనే థీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైయస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను చేర్చారు. మరోవైపు ఇది చూసి ఓర్వలేని విపక్ష నేతలు గోతికాడ నక్కల్లా చూస్తున్నట్టున్న ఈ చిత్రం వైసీపీ శ్రేణులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటో చెబుతుంది అంటారు. ఈ చిత్రానికి కూడా ఉన్న ప్రత్యేకత అలాంటిదే.
డీపీగా పెట్టుకుంటున్న అభిమానులు..
రాష్ట్రంలో సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ ఫొటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. ఆలోచనాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం ప్రజల మనసును కట్టిపడేస్తుంది. తమ ఫోన్ స్క్రీన్ లలో, వాట్సప్ స్టేటస్ లలో, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తమ డీపీగా పెట్టుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడు జగనన్న పాలనకు ప్రతిరూపంగా వారు భావిస్తున్నారు. ఈ ఫ్లెక్సీలు పెట్టిన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అభిమాన నాయకుడి పేరున ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను ప్రతి ఒక్కరూ అసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది.ఈనెల 21న సీఎం వైయస్ జగన్ పుట్టిన రోజు నాటికి ఈ జోష్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout