CM Revanth Reddy:లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. మూసీ అభివృద్ధిపై అధ్యయనం..
Send us your feedback to audioarticles@vaarta.com
దావోస్ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం లండన్‌లో పర్యటిస్తోంది. మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. లండన్ చేరుకున్న రేవంత్ రెడ్డికి అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలుగు వారి ఆత్మీయ కలయిక అంటూ అక్కడ నిర్వహించే కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. "రేపటి అద్బుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది" అనే ట్యాగ్‌లైన్‌తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే నైట్ థేమ్స్ రివర్ ప్రాంతంలో రేవంత్ పర్యటించారు.
అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లోని మూసీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు లండన్ పర్యటనను వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మూసీ నదిని థేమ్స్ నదిలా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో థేమ్స్ రివర్ పొడవునా అభివృద్ధి ఎలా జరిగిందన్న అంశంపై రేవంత్ స్వయంగా పర్యటించి అధ్యయనం చేస్తున్నారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఉండటం గమనార్హం.
ఇద్దరు కలిసి లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిపై ఏరియల్ స్టడీ కోసం లండన్ షార్డ్ వ్యూను సందర్శించారు. ఆ నది విశిష్టత ఏంటి అంటే లండన్ ఉత్తరం వైపు ఓల్డ్ సిటీని, పశ్చిమ భాగాన ఉన్న మోడ్రన్ సీటీని కలుపుతుంది. దీంతో ఈ నదిని ఎలాగైతే అభివృద్ధి చేశారో మూసీని కూడా అలాగే అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈనెల 14 నుంచి 18వ తేది దావోస్‌లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి పలువురు దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు.
ఈ సదస్సులో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదాఇనీ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ప్రపంచ ఆర్థిక సదస్సు చైర్మన్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. రేవంత్ వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి రూ.36వేల కోట్లకు పైగా సంబంధించిన పెట్టుబడులపై ఒప్పందాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com