Revanth Reddy: దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి బిజీజిజీ.. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ..
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీగా గడుపుతోంది. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఇప్పటివరకు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్, గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్, ప్రపంచ ఆర్థిక సదస్సు చైర్మన్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికారు. రేవంత్ వెంట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారులు ఉన్నారు.
ఆకట్టుకుంటున్న తెలంగాణ పెవిలియన్..
ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ను 'వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్' ట్యాగ్ లైన్‌తో సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటేలా ఈ వేదికను రూపొందించారు. తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ, బోనాల పండుగ, చార్మినార్ వంటి చారిత్రాత్మక చిహ్నాలను అందులో ఉంచారు. అలాగే 'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' పేరులో తెలంగాణ కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ- సాంకేతిక ఆవిష్కరణల సౌధం టీ హబ్, స్కైరూట్ ఏరోస్పేస్, విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా వాల్ డిజైనింగ్ తయారు చేశారు. ఇవి అక్కడ వారిని ఆకట్టుకుంటున్నాయి.
రేవంత్ న్యూ లుక్ ఫొటోలు వైరల్..
ఇదిలా ఉంటే ఈ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచ ఆర్థిక సదస్సు ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్(C4IR)హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నారు. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. కాగా దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సూటుబూటుతో సరికొత్త లుక్‌లో కనిపించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా డ్రెస్ స్టైల్ మార్చారు. ఇప్పటివరకు తెల్ల చొక్కా, నల్ల ఫ్యాంటు మాత్రమే ఆయన ధరించారు. దీంతో ప్రస్తుతం రేవంత్ న్యూ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments