Revanth Reddy: ఒకేరోజు రెండు గ్యారంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

  • IndiaGlitz, [Saturday,December 09 2023]

డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండగ రోజు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే 'అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించే తొలి బస్సును సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో మంత్రి సీతక్క, సీఎస్ జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమది తెలంగాణ అని చెప్పే అవకాశం ప్రజలకు సోనియమ్మ ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని.. అందులో భాగంగా పండుగ రోజైన ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు లబ్ది పొందనున్నారని తెలిపారు. ఈ సందర్బంగా బాక్సర్ నిఖత్ జరీనాకు రూ.2 కోట్లు చెక్ అందించారు.

కాగా నేటి నంచి జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌.. హైదరాబాద్‌లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మొదటి వారం రోజులు ఎలాంటి ఐడెంటీ కార్డులు అవసరం లేదు. కేవలం తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర బస్సుల్లో అయితే రాష్ట్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. తెలంగాణ పరిధిలో ఎన్ని కిలోమీటర్లు అయినా మహిళలు ఉచితగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది.

More News

Pindam: కేవలం టీజర్ తోనే మా సినిమా బిజినెస్ అయిపోయింది: 'పిండం' దర్శకుడు సాయికిరణ్ దైదా

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం 'పిండం'. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Keerthi Bhatt: వాళ్ళు దొరికితే రోడ్డు మీద నించోబెట్టి కొడతా! : బిగ్ బాస్ కీర్తి భట్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 చివరి దశకు వచ్చింది. హౌస్‌లో నలుగురు కటెంస్టులు మాత్రమే నిలిచారు. వీరిలో ఒకరి విజేతగా నిలవనున్నారు. ఇదంతా పక్కనపెడితే హౌస్‌లో కటెంస్టుల కొట్లాటల గురించి చెప్పనక్కర్లేదు.

అసెంబ్లీలో ప్రమాణం చేసిన ఎమ్మెల్యేలు.. కేటీఆర్ గైర్హాజరు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణం చేయించారు.

BRS LP నేతగా కేసీఆర్.. అసెంబ్లీని బహిష్కరించిన బీజేపీ..

బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎ కేసీఆర్‌ ఎంపికయ్యారు. తెలంగాణ భవన్‌లో సీనియర్ నేత కేశవరావు అధ్యక్షతన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ మేరకు తీర్మానం చేశారు.

Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాలోని గాంధీభవన్‌లో ఘనంగా జరిగాయి. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి,