Revanth Reddy: ఒకేరోజు రెండు గ్యారంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు పండగ రోజు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 'మహాలక్ష్మి' పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే 'అందరికీ వైద్యం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ' పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించే తొలి బస్సును సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో మంత్రి సీతక్క, సీఎస్ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమది తెలంగాణ అని చెప్పే అవకాశం ప్రజలకు సోనియమ్మ ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారని.. అందులో భాగంగా పండుగ రోజైన ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు లబ్ది పొందనున్నారని తెలిపారు. ఈ సందర్బంగా బాక్సర్ నిఖత్ జరీనాకు రూ.2 కోట్లు చెక్ అందించారు.
కాగా నేటి నంచి జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్‌లో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. మొదటి వారం రోజులు ఎలాంటి ఐడెంటీ కార్డులు అవసరం లేదు. కేవలం తెలంగాణకు చెందిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర బస్సుల్లో అయితే రాష్ట్ర సరిహద్దు వరకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. తెలంగాణ పరిధిలో ఎన్ని కిలోమీటర్లు అయినా మహిళలు ఉచితగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments