Gaddar Statue: మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

  • IndiaGlitz, [Tuesday,January 30 2024]

దివంగత ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి HMDA ఆమోదం తెలిపింది. దీంతో విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవంగా రామచంద్రాపురంలో నిర్మించిన గద్దర్ విగ్రహాన్ని జనవరి 31న డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆవిష్కరించాల్సి ఉంది. అయితే విగ్రహం ఏర్పాటు చేస్తున్న స్థలం HMDA పరిధిలోకి వస్తుందని కొంత మంది అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గద్దర్ విగ్రహావిష్కరణకు బ్రేక్ పడింది.

సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లడంతో ఆయన కలుగజేసుకుని విగ్రహ ఏర్పాటుకు అనుమతి లభించేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా గద్దర్ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంపై ప్రజా సంఘాలు, ఉద్యమకారులు హర్షం చేస్తున్నారు. గతంలో గద్దర్ విగ్రహ ఏర్పాటు చేస్తానని రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు.

గతేడాది అనారోగ్యంతో గద్దర్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించినప్పటి నుంచి టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరుండి సొంత మనిషిలా అన్ని కార్యక్రమాలు చూసుకున్నారు. గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న రేవంత్.. భౌతికకాయాన్ని ఎల్బీస్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర, అంత్యక్రియలను ముందుండి నిర్వహించారు.

కాగా ప్రజాగాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన గద్దర్ తన కుమారుడు సూర్యను రాజకీయాల్లో తీసుకురావాలని ప్రయత్నించారు. దీంతో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌ పార్టీ కోసం పోరాడారు. ఖమ్మంలో జరిగిన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గద్దర్‌ను దగ్గరికి తీసుకుని అప్యాయంగా పలకరించారు.

అయితే కుమారుడిని రాజకీయాల్లో చూడాలన్న కోరిక తీరకుండానే గద్దర్ ప్రాణాలు వదిలారు. దాంతో గద్దర్ కోరికను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. గద్దర్ కుటుంబానికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. కుమారుడికి బదులుగా ఆయన కుమార్తె వెన్నెలకు సికింద్రాబాబ్ కంటోన్మెంట్‌ టికెట్‌ను కేటాయించగా.. ఆమె ఓడిపోయారు. అయినా కానీ గద్దర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూనే ఉంది.

More News

Adimoolam: నారా లోకేష్‌తో సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం భేటీ

ఎన్నికల వేళ వైసీపీలో అసంతృప్త రాగాలు ఎక్కువతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోకి వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

Pushpa 2:పుష్ప2 నుంచి చీరలో బన్నీ గెటప్ లీక్.. దర్శకుడు సుకుమార్ సీరియస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Prof Kodandaram: తెలంగాణ హైకోర్టులో ప్రొఫెసర్ కోదండరామ్‌కు షాక్

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరామ్, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం

Ayyannapatrudu: సీఎం జగన్ నుంచి షర్మిలకు ప్రాణహాని ఉంది: అయ్యన్నపాత్రుడు

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. "సీఎం జగన్ చాలా దుర్మార్గుడు.

Prime Minister Modi:ప్రధాని మోదీ భారీ స్కెచ్.. యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి పేరు కొంతకాలంగా మార్మోగుతూనే ఉంది. ఇటీవల దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అవార్డు దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖల