Revanth Reddy: జల జగడం.. కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్..

  • IndiaGlitz, [Tuesday,February 13 2024]

మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే అసెంబ్లీ వచ్చి ప్రాజెక్టులపై చర్చించాలని సవాల్ విసిరారు. పక్కనే ఉన్న అసెంబ్లీకి రాకుండా నల్గొండకు పోయి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. దక్షిణ తెలంగాణలో ఉన్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్‌లోని 36 నియోజకవర్గాల్లో కేవలం 4 సీట్లు మాత్రమే బీఆర్‌ఎస్ గెలిచిందని.. అందుకే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిచేందుకు నల్గొండ వేదికగా డ్రామాలు స్టార్ట్ చేశారని ఫైర్ అయ్యారు. కృష్ణా నది జలాల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించిందే కేసీఆర్ అని.. మళ్లీ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

అంతకుముందు మేడిగడ్డ బ్యారేజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరీశీలించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని తెలిపారు. లక్ష ఎకరాలకు నీరు అందక పోయినా.. కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు.

కాళేశ్వరంకు ఏడాదికి విద్యుత్ బిల్లులు 10వేల 500 కోట్లు.. ప్రతి ఏడాది. ఇప్పటివరకు అయిన ఖర్చుకు ఇక నుండి ప్రతి ఏడాది.. 20వేల కోట్లు మిత్తి, అసలు ఇన్ స్టాల్ మెంట్ కడితే అయ్యే ఖర్చు. ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ద్వారా 19,63,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ప్రతిపాదన. కేసీఆర్.. కోటి ఎకరాలకు నీళ్ళు అనడం పచ్చి అబద్దం. ఇప్పటివరకు 94వేల కోట్లు ఖర్చు చేశారు. అంతా పూర్తైతే.. ప్రతి ఏటా రెండున్నర లక్షలు ఖర్చు చేస్తే.. 19లక్షల ఎకరాలకు నీళ్లు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కూలింది. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.

మేడిగడ్డలో 85 పిల్లర్స్. 7 బ్లాక్‌లో పిల్లర్స్ కుంగాయి. డిజైన్, నిర్వహణ, కాంట్రాక్ట్ పనుల్లో నాణ్యత లోపం ఉందని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పింది. 2020లోనే నాణ్యతా లోపం ఉందని ఇరిగేషన్ అధికారులు గుర్తించి ఎల్ అండ్ టీ కి లేఖ రాసినా పట్టించుకోలేదు. 2020లోనే మేడిగడ్డ బ్యారేజీలో సమస్య ఉందని అధికారులు ఎల్ అండ్ టీ సంస్థకు లేఖ రాశారు. 2023 అక్టోబర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వచ్చి పరిశీలించి లోపం ఉన్నట్లు చెప్పారు. 6 రకాల టెస్టులకు సూచించారు.

ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంలలో ఎక్కడా నీళ్లు లేవు. నీళ్లు స్టోర్ చేస్తే అసలు రంగు బయటపడుతుంది. నీళ్లు స్టోర్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో బయటపడతాయి. కాళేశ్వరంలో.. ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. గత ఏడాది కేవలం 8 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారు. ప్రతి ఏడాది 180 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని కేసీఆర్ చెప్పారు అని రేవంత్ వివరించారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి.

More News

KCR: కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు.. ప్రభుత్వంపై గులాబీ బాస్ ఫైర్..

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిర‌గ‌నివ్వరా..? ఎన్ని గుండెల్రా మీకు అని మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నిర్వహించింది.

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం.. నదిలో దొరికిన డైరెక్టర్ మృతదేహం..

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఫిల్మ్ డైరెక్టర్ వెట్రి దురైస్వామి అకాల మరణం చెందారు. సట్లెజ్ నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో

దేశ ప్రజలకు మోదీ శుభవార్త.. ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్..

ఎన్నికల వేళ దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభవార్త అందించారు. కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

YS Sharmila: వైసీపీ నేతలకు షర్మిల సవాల్.. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉందా..?

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆమె రచ్చబండ కార్యక్రమాల ద్వారా ఎండగడుతున్నారు.

Hyderabad: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలి.. తెరపైకి కొత్త డిమాండ్..

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.