Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్.. బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కూడా 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో.. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే సవాల్ చేశారని గుర్తు చేసింది. రాజకీయ సన్యాసం చేస్తానని రెండు సార్లు ఛాలెంజ్ చేసి మాట మీద నిలబడకుండా పారిపోయిన ఓటుకు నోటు దొంగవి నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా..? అంటూ ట్వీట్ చేసింది.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఆయన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని.. ఒకటి కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో గెలిచి చూపిస్తామని తెలిపారు. గతంలో కూడా ఇలాగే ఛాలెంజ్‌లు చేసి తోకముడిచారని ఎద్దేవా చేస్తున్నారు.
కాగా మంగళవారం రాత్రి చేవెళ్ల జన జాతర సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కేటీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్లని వేపచెట్టుకు కట్టేసి తొండలను వదలండన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాకపోతుండే అని కేటీఆర్ అంటున్నాడని.. ఇవాళ తాను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా పార్లమెంట్ ఎన్నికలకు వస్తున్నానని.. కేటీఆర్‌కు దమ్ముంటే.. మగాడైతే ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు.
తాము అల్లాటప్పగాళ్లం కాదని.. అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చొలేదని చురకలంటించారు. అక్రమ కేసులు పెట్టినా కొట్లాడి.. నల్లమల అడవి నుంచి తొక్కుక్కుంటూ తొక్కుకుంటూ వచ్చి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి వారిని బొందపట్టి ఆ కుర్చీలో తనను కార్యకర్తలు కూర్చొబెట్టారని.. ఈ రోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నానంటే అది కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, వారి పోరాట ఫలితమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అండగా నిలిచినంత కాలం, తనను భుజాన మోసినంత కాలం కేటీఆర్, ఆయన తండ్రీ కేసీఆర్ వచ్చినా ఈ కుర్చీని తాకలేరని సవాల్ విసిరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments