Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌.. బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..?

  • IndiaGlitz, [Wednesday,February 28 2024]

మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కూడా 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో.. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాగే సవాల్ చేశారని గుర్తు చేసింది. రాజకీయ సన్యాసం చేస్తానని రెండు సార్లు ఛాలెంజ్ చేసి మాట మీద నిలబడకుండా పారిపోయిన ఓటుకు నోటు దొంగవి నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా..? అంటూ ట్వీట్ చేసింది.

మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఆయన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని.. ఒకటి కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో గెలిచి చూపిస్తామని తెలిపారు. గతంలో కూడా ఇలాగే ఛాలెంజ్‌లు చేసి తోకముడిచారని ఎద్దేవా చేస్తున్నారు.

కాగా మంగళవారం రాత్రి చేవెళ్ల జన జాతర సభలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ టార్గెట్‌గా రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యంగా కేటీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్లని వేపచెట్టుకు కట్టేసి తొండలను వదలండన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు రాక‌పోతుండే అని కేటీఆర్ అంటున్నాడ‌ని.. ఇవాళ తాను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా పార్లమెంట్ ఎన్నికలకు వస్తున్నానని.. కేటీఆర్‌కు దమ్ముంటే.. మగాడైతే ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించాల‌ని ఛాలెంజ్ చేశారు.

తాము అల్లాట‌ప్పగాళ్లం కాద‌ని.. అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చొలేద‌ని చురకలంటించారు. అక్రమ కేసులు పెట్టినా కొట్లాడి.. న‌ల్లమ‌ల అడ‌వి నుంచి తొక్కుక్కుంటూ తొక్కుకుంటూ వ‌చ్చి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి వారిని బొందపట్టి ఆ కుర్చీలో త‌న‌ను కార్యక‌ర్తలు కూర్చొబెట్టార‌ని.. ఈ రోజు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నానంటే అది కాంగ్రెస్ కార్యక‌ర్తల త్యాగం, వారి పోరాట ఫ‌లిత‌మ‌న్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అండ‌గా నిలిచినంత కాలం, త‌న‌ను భుజాన మోసినంత కాలం కేటీఆర్‌, ఆయ‌న తండ్రీ కేసీఆర్ వ‌చ్చినా ఈ కుర్చీని తాక‌లేర‌ని సవాల్ విసిరారు.

More News

MP Magunta: వైసీపీకి మరో బిగ్ షాక్.. ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా..

ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలందరూ ఒక్కొక్కరిగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి (Magunta Sreenivasulu Reddy)

ప్రయాణికులకు శుభవార్త.. రైల్వే ఛార్జీలు తగ్గింపు..

ప్రయాణికులకు రైల్వే శాఖ (Indian Railways) శుభవార్త అందించింది. ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌గా మారిన ప్యాసింజర్‌ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

CM Revanth Reddy: ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద

Hyper Aadi: ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయాం.. మనకు ఇలా అడిగే హక్కు ఉందా..?

పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లే తీసుకున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)ను కొంతమంది జనసైనికులు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

Ambajipeta Marriage Band: ఓటీటీలోకి ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

యువ హీరో సుహాస్ హీరోగా ఇటీవల విడుదలైన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌‘ చిత్రం డిసెంట్ హిట్ అయింది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలైన సంగతి తెలిసిందే.