Revanth Reddy Brother:భారీ కాన్వాయ్‌తో తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు.. వీడియో వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే పాలన మీద తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ మారిన వీడియో ఇబ్బందికరంగా మారనుంది. గురువారం కామారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా వచ్చారు.
అయితే కొండల్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో సభకు రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కాన్వాయ్‌తో సైరెన్ మోగిస్తూ ఆయన రావడంతో సీఎం వస్తున్నాడేమో స్థానికులు అనుకున్నారు. కానీ మధ్యలో స్థానిక నేతలతో మాట్లాడటానికి ఓ చోట కాన్వాయ్ ఆపారు. దీంతో అందులో ఉండి సీఎం సోదరుడు కొండల్ రెడ్డి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇది వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. "ఎస్కార్ట్ ఇవ్వడానికి.. ఎమ్మెల్యే కాదు...ఎమ్మెల్సీ కాదు.. మంత్రి కూడా కాదు.. సీఎం కాదు..సీఎం తమ్ముడు అయితే ఎస్కార్ట్ ఇవ్వాలా???ఎటు పోతుంది తెలంగాణ... దొరల రాజ్యం అన్న మేధావి వర్గం కళ్ళు మూసుకొన్నట్టున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నా తెలంగాణ రజాకార్, బ్రిటిష్ రాజ్యం వైపు పయనిస్తుంది" అని పోస్ట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పదిరోజులు కూడా కాలేదు అప్పుడే ఇలాంటి పనులేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ప్రజాప్రతినిధులకు భద్రత కుదించి ఎలాంటి పదవిలో లేని సీఎం తమ్ముడికి మాత్రం ఎస్కార్ వాహనంతో సెక్యూరిటీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారో..? లేదో..? చూడాలి.
తమ్ముడు తన లెక్కనే అచ్చుగుద్దిన డూప్ గా ఎంత ఉంటె మాత్రం రాష్ట్రానికి ఇద్దరు గుంపు మేస్త్రిలను తయారు చేస్తున్నట్లున్నారు సీఎం గారు..
— Shiva Warangal (@SkWarangal) December 15, 2023
ఒకరు అధికారిక దోపిడీకి , ఇంకొకరు అనధికార దోపిడీకి.. Wah GM saab Wah..!!😜😜😂 pic.twitter.com/QIIYIKUkv3
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments