Revanth Reddy Brother:భారీ కాన్వాయ్‌తో తిరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు.. వీడియో వైరల్..

  • IndiaGlitz, [Friday,December 15 2023]

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే పాలన మీద తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ మారిన వీడియో ఇబ్బందికరంగా మారనుంది. గురువారం కామారెడ్డిలో కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అదే మాదిరిగా రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి కూడా వచ్చారు.

అయితే కొండల్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో సభకు రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కాన్వాయ్‌తో సైరెన్ మోగిస్తూ ఆయన రావడంతో సీఎం వస్తున్నాడేమో స్థానికులు అనుకున్నారు. కానీ మధ్యలో స్థానిక నేతలతో మాట్లాడటానికి ఓ చోట కాన్వాయ్ ఆపారు. దీంతో అందులో ఉండి సీఎం సోదరుడు కొండల్ రెడ్డి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఇది వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఎస్కార్ట్ ఇవ్వడానికి.. ఎమ్మెల్యే కాదు...ఎమ్మెల్సీ కాదు.. మంత్రి కూడా కాదు.. సీఎం కాదు..సీఎం తమ్ముడు అయితే ఎస్కార్ట్ ఇవ్వాలా???ఎటు పోతుంది తెలంగాణ... దొరల రాజ్యం అన్న మేధావి వర్గం కళ్ళు మూసుకొన్నట్టున్నారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నా తెలంగాణ రజాకార్, బ్రిటిష్ రాజ్యం వైపు పయనిస్తుంది అని పోస్ట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి పదిరోజులు కూడా కాలేదు అప్పుడే ఇలాంటి పనులేంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ప్రజాప్రతినిధులకు భద్రత కుదించి ఎలాంటి పదవిలో లేని సీఎం తమ్ముడికి మాత్రం ఎస్కార్ వాహనంతో సెక్యూరిటీ ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారో..? లేదో..? చూడాలి.

More News

Governor:తమది ప్రజా ప్రభుత్వం.. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగం

తెలంగాణ అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో

Unstoppable:అన్‌స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ ప్రొమో వచ్చేసింది.. గెస్ట్‌లు ఎవరంటే..?

నటసింహం నందమూరి బాలకృష్ణలో సరికొత్త యాంగిల్ చూపించిన అన్‌స్టాపబుల్ విత్ NBK టాక్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

KCR:ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ య‌శోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని

Bigg Boss Telugu 7 : పాత టాస్క్‌లతో కొత్త గేమ్స్ ఆడించిన బిగ్‌బాస్.. ఒకరి కోసం ఒకరు కష్టపడ్డ కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ 7 తెలుగు ఈ వారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. గత వారం శోభాశెట్టి ఎలిమినేట్ కాగా..

KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదింపు.. గులాబీ శ్రేణులు ఆగ్రహం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసిన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.