4 దశాబ్దాల కేరళ చరిత్రను తిరగరాసిన విజయన్..
Send us your feedback to audioarticles@vaarta.com
నాలుగు దశాబ్దాల కేరళ చరిత్రలో అధికార పార్టీ రెండోసారి విజయం సాధించిన దాఖలాలైతే లేవు. కానీ చరిత్రను తిరగరాస్తూ ఈసారి సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి రెండో సారి విజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీతో ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమిపై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కేరళలో బీజేపీ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోవడం విశేషం. దేశంలో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ. ఇక్కడ మరోసారి లెఫ్ట్ పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఘనత విజయన్‌దే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎల్‌డీఎఫ్ కూటమికి అన్నీ తానై వ్యవహరించారు.
Also Read: బెంగాల్ విజయం తర్వాత ప్రశాంత్ కిషోర్ షాకింగ్ ప్రకటన
నిజానికి ఎల్‌డీఎఫ్ కూటమనిని అవినీతి కుంభకోణాలు కొంతమేర ఇబ్బంది పెట్టాయి. బంగారం స్మగ్లింగ్‌లో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం హస్తముందంటూ ఆరోపణలు వచ్చాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ, కస్టమ్స్ వంటి పలు సంస్థలు కేరళ లెఫ్ట్ నాయకులు, వారి ఇళ్లపై దాడులు జరిపాయి. వాటి ఫలితాలైతే తేలలేదు కానీ కేంద్ర ప్రభుత్వం కావాలనే తమపై కక్ష కట్టిందని పినరయి విజయన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. దీంతో ప్రజలు ఈ ఆరోపణలను లైట్ తీసుకున్నారు. తమపై వచ్చిన ఆరోపణలతో ఏమాత్రం కుంగిపోకుండా సమర్థంగా తిప్పి కొట్టి స్ట్రాంగ్ మ్యాన్ అన్న ఇమేజ్‌ను విజయన్ మరింత ధృఢ పరుచుకున్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఇటీవలి కాలంలో దేశాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి విషయంలోనూ విజయన్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తమ ప్రభుత్వాన్ని మరింత చేరువయ్యేలా చేశాయి. నిజానికి విజయన్ పని తీరుకు గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజలు పట్టం కట్టారు. అంతేకాకుండా ‘సైబర్ ఆర్మీ పేరిట ఆ పార్టీ కార్యకర్తలు ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసి.. ప్రభుత్వ పథకాలను, వాటి ప్రయోజనాలు వంటి అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఇది కూడా పినరయి విజయన్ ప్రభుత్వాన్ని మరోసారి గెలుపు వాకిట్లో నిలబెట్టాయి. ప్రస్తుతం ఎల్‌డీఎఫ్ కూటమి 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. యూడీఎఫ్ కూటమి 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com