CM KCR:టీడీపీని ఎన్టీఆర్ అందుకే స్థాపించారు: సీఎం కేసీఆర్

  • IndiaGlitz, [Monday,November 20 2023]

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే దివంగత సీఎం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ పరిపాలన బాగలేకనే కదా ఎన్టీఆర్ టీడీపీని పెట్టారని.. బాగుంటే ఎందుకు పెడతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి రూ.2లకే కిలో బియ్యం ఇచ్చాకే పేదల కడుపు నిండిందని కొనియాడారు.

కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు నష్టం చేసిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. ఉన్న తెలంగాణను బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారన్నారు. మళ్లీ మన తెలంగాణ సాధించడం కోసం 58 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగా ఇస్తామంటే 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిశామని.. ఇవ్వకపోయే సరికి ఉద్యమం తీవ్రతరం చేశామన్నారు. అనేక పోరాటాల తర్వాత సకలజనుల సమ్మె అంటూ ఉద్యమం చేస్తే గానీ తెలంగాణ కల సాకారం కాలేదని కేసీఆర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు ఆయన శుభవార్త చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ ఖర్చులను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్యాసింజర్ ఆటోలకు ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం అలవెన్స్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

More News

Chandrababu:చంద్రబాబుకు భారీ ఊరట.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఆయనకు పూర్తి స్థాయి బెయిల్‌ మంజూరు చేస్తూ

Greater Hyderabad:ఒంటిరిగా గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థులు.. కీలక నేతల కోసం ఎదురుచూపులు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తుది దశకు చేరింది. అన్ని పార్టీల నేతలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

CM Jagan:విశాఖ అగ్నిప్రమాదం వెనక ప్రతిపక్షాల కుట్ర.. విచారణకు సీఎం జగన్ ఆదేశాలు..

అందమైన సాగర తీరమైన విశాఖ నగరంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Lokesh:లోకేష్ పాదయాత్ర పున:ప్రారంభం.. ప్లాన్‌లో మార్పులు..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) తిరిగి ప్రారంభం కానుంది.

Leo:'లియో' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమా దసరా కానుకగా విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.