ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్న సీఎం కేసీఆర్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్నారు. శనివారం కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయించుకున్నారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థ(గడా) అధికారి ముత్యంరెడ్డి, మండల పంచాయతీ అధికారి సుమన్, గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్‌కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్ వివరాలతోపాటు కేసీఆర్ ఫొటోను సిబ్బంది యాప్‌లో అప్‌లోడ్ చేశారు.
ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రతను కల్పించేందుకే ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ భూముల తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. విధిగా ప్రతి ఒక్కరూ ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్థిరాస్తి నమోదు ప్రక్రియ తెలంగాణలో జరుగుతోందన్నారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments