ఆస్తుల వివరాలను నమోదు చేయించుకున్న సీఎం కేసీఆర్..

  • IndiaGlitz, [Sunday,October 11 2020]

తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమం జరుగుతోంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆస్తుల వివరాలను నమోదు చేసుకున్నారు. శనివారం కేసీఆర్ సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లి శివారులోని వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయించుకున్నారు. గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థ(గడా) అధికారి ముత్యంరెడ్డి, మండల పంచాయతీ అధికారి సుమన్, గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్‌కు ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ వివరాలతోపాటు కేసీఆర్‌ ఫొటోను సిబ్బంది యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు.

ఆస్తులపై ప్రజలకు హక్కు, భద్రతను కల్పించేందుకే ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ భూముల తరహాలోనే వ్యవసాయేతర ఆస్తులకూ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. విధిగా ప్రతి ఒక్కరూ ఆస్తుల వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్థిరాస్తి నమోదు ప్రక్రియ తెలంగాణలో జరుగుతోందన్నారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

More News

సింగిల్ ఫ్రేమ్‌లో మెగాస్టార్ డైరెక్టర్లు.. వైరల్ అవుతున్న పిక్..

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనంతరం ఒక సినిమా చేస్తూ వచ్చారు. తాజాగా మాత్రం స్పీడ్ అందుకున్నారు.

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

బుట్టబొమ్మ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున కూల్ కూల్‌గా వచ్చారు. కానీ ఒక్కొక్కరిపై కొరడా ఝుళిపించారు. పేరు పేరునా వాయించి వదిలిపెట్టారు.

'ఒరేయ్ బుజ్జిగా..'మూవీతో మా గోల్ రీచ్ అయినందుకు హ్యాపీగా ఉంది - యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన చిత్రం

ఆర్జీవీ సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిశ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రాంగోపాల్‌వర్మ దిశ సినిమాపై ఆమె తండ్రి శ్రీధర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల.. టాపర్స్‌లో తెలంగాణ విద్యార్థులు

ఏపీ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్2లో ఇంజినీరింగ్ పరీక్షకు