సీఐడీ విచారణకు సీఎం కేసీఆర్ ఆదేశం...
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీశైలం పవర్ ప్లాంటు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తక్షణమే వెలికి తీయాలని.. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్‌సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఖర్చుతో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్య తీసుకోవాలని ఆదేశించారు.
గురువారం రాత్రి శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగలో ఉన్న ఈ భూగర్భ విద్యుత్తు కేంద్రం ఉంది. దీనిలో ఉన్న ఆరు టన్నెళ్లలో నాలుగు టన్నెళ్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఇప్పటికే ఆరు మృతదేహాలను వెలికితీసి.. జెన్‌కో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమరరాజ కంపెనీ ఉద్యోగులున్నట్లు గుర్తించారు.
సహాయక చర్యల్లో సీఐఎస్ఎఫ్, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలగడమే కాకుండా పలువురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు. విద్యుత్ కేంద్రంలో చిక్కుకుపోయినవారి కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు అందించాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments