CM KCR:నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి స్థానాలకు సీఎం కేసీఆర్ నామినేషన్లు

  • IndiaGlitz, [Monday,October 09 2023]

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ నవంబర్ 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి గజ్వేల్‌లో మొదటి నామినేషన్ వేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖ‌లు చేస్తారు. తదుపరి 3 గంటల‌కు కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

అక్టోబర్ 15న బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం..

ఇక అక్టోబర్ 15న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమవుతారు. అదే రోజు అభ్యర్థులకు బీఫారం అందజేయడంతో పాటు పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. నవంబర్ 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో.. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరం సభలకు హాజరుకానున్నారు. 18న జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే పార్టీ సమావేశంతో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు చేశారు. మరోవైపు ఇతర నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు.

నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్..

ఇక తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 15 వరకు నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణలో మొత్తం 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా 20,892 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సగటున ప్రతి పోలింగ్‌ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పింది. అలాగే 27,798 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాట్లు చేసినట్లు సీఈసీ వెల్లడించింది.

More News

CM Jagan:రాజకీయ కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్టు చేయలేదు.. సీఎం జగన్ క్లారిటీ

టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చెయ్యలేదని.. ఆయనపై తనకు ఎలాంటి కక్ష లేదని సీఎం జగన్ తెలిపారు.

Chandrababu:చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

KTR:రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. నోటుకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాకీయాలు హీటెక్కాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తులు పైఎత్తులకు దిగాయి.

Telangana:తెలంగాణలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. పాటించాల్సిన నిబంధనలు ఏమిటి..?

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

KCR:కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమా..? కొత్త ప్రభుత్వం వస్తుందా..? తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

కొంతకాలంగా రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికలకు సైరెన్ మోగింది.