CM KCR:గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల అంఖం తుది దశకు చేరుకుంది. రేపటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోటీపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. ఎర్రవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గజ్వేల్‌కు చేరుకున్న కేసీఆర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం గజ్వేల్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి కేసీఆర్ బయల్దేరారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల లోపు కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. తొలిసారి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరోవైపు గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్‌లో గెలుపు తనదేంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై పోటీచేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్‌పై కీలక నేతలు పోటీ చేయడంతో ఇక్కడ రసవత్తర పోరు నెలకొంది. తెలంగాణతో పాటు ఆంధ్రలోనూ ప్రజల చూపు ఈ రెండు నియోజకవర్గాలపైనే ఉంది. కేసీఆర్‌ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా తమ అధినేతను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది.
అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా సిరిసిల్లలో నామినేషన్ వేశారు. ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్ నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆయన.. ఆర్టీవో కార్యాలయంలో ఉదయం 11:45 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఇక మంత్రి హరీష్ రావు సైతం సిద్ధిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్ధిపేటలో సర్వమత ప్రార్థనల అనంతరం నామినేషన్ వేసేందుకు కార్యకర్తలు, అభిమానుల సందోహం మధ్య ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. మొత్తానికి రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout