పీఎం పర్యటనకు సీఎం కేసీఆర్‌కు అనుమతి లేదట...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ప్రధాని తమ రాష్ట్రానికి వస్తున్నారంటే.. ప్రోటోకాల్ ప్రకారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, కేంద్ర మంత్రులు విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలుకుతారు. అయితే తెలంగాణ విషయంలో మాత్రం ఇది జరగబోవడం లేదు. తొలుత ప్రధానికి స్వాగతం పలకాలని సీఎం కేసీఆర్ కూడా భావించారని టీఆర్ఎస్ ముఖ్యులు తెలిపారు. అయితే ఆహ్వానం పలకడానికి సీఎం కేసీఆర్‌ కు అనుమతి రాలేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు తాజాగా తెలిపాయి.

భారత్‌ బయోటెక్‌ సంస్థలో కరోనా టీకా తయారీ పురోగతిపై సమీక్షకు మోదీ శనివారం రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ స్వాగతం పలకాలని భావించారని.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)కు సమాచారం ఇచ్చిందని టీఆర్ఎస్ తెలిపారు. అయితే సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పినట్లు టీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.

మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఐదుగురికి మాత్రమే పీఎంవో అవకాశం ఇచ్చిందని టీఆర్ఎస్ ముఖ్యులు తెలిపారు. వీరిలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతామొహంతి, సైబరాబాద్‌ సీపీ వీసీ సీజ్జనార్‌, హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కమాండెంట్‌ ఉన్నారు. అయితే ప్రధాని పర్యటన సమయంలో సీఎం రావల్సిన అవసరం లేదనే ఆదేశాలు గతంలో ఎన్నడూ రాలేదని.. ఇదే ప్రథమమని టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు.

More News

బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు.

రేస్ టు ఫినాలే స్టార్ట్..

‘ఓ బేబీ’ టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. మోనాల్ యోగాసనం వేసింది. నేనూ చేస్తా.. నాకేమైనా తక్కువా అని అవినాష్ వచ్చాడు.

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది: జేపీ నడ్డా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఎన్టీఆర్ స‌ర‌స‌న మ‌హేశ్ హీరోయిన్‌?

టాలీవుడ్‌లో ఎవ‌రైనా స్టార్ హీరో సినిమా మొద‌లైందంటే.. ఆ హీరో స‌ర‌స‌న న‌టించ‌బోయే జోడీ ఎవ‌రా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ అవుతుంది.

'మేక సూరి 2' మూవీ రివ్యూ

కోవిడ్ పుణ్య‌మాని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజిన‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అలా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్స్‌లో ‘మేక‌సూరి’ ఒక‌టి.