CM KCR:సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం.. పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం.
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దేవరకద్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్‌ను తిరిగి వెనక్కి మళ్లించి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు. మరో హెలికాఫ్టర్‌ను ఏవియేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆ హెలికాఫ్టర్ రాగానే యథావిధిగా తన పర్యటనను కేసీఆర్ కొనసాగించనున్నారు. మరోవైపు సాంకేతిక సమస్య ఎందుకు తలెత్తిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. కాగా ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇవాళ దేవరకద్ర, గద్వాల్, నారాయణ్‌పేట, మక్తల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజాశీర్వాద యాత్రలో పాల్గొనాల్సి ఉంది.
ఇక రెండో విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 13 నుంచి 28 వరకు మొత్తం 16 రోజులు 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.
కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్ ఇదే..
నవంబర్ 13- దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్
నవంబర్ 14- పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
నవంబర్ 15- బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్
నవంబర్ 16- ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్
నవంబర్ 17- కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల
నవంబర్ 18- చేర్యాల
నవంబర్ 19- అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి
నవంబర్ 20- మానకొండూరు, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ
నవంబర్ 21- మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట
నవంబర్ 22- తాండూర్, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగి
నవంబర్ 23- మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు
నవంబర్ 24- మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
నవంబర్ 25- గ్రేటర్ హైదరాబాద్
నవంబర్ 26- ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
నవంబర్ 27- షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డి
నవంబర్ 28- వరంగల్, గజ్వేల్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments