వైద్య ఆరోగ్య శాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

  • IndiaGlitz, [Saturday,April 24 2021]

కరోనా మహమ్మారి నియంత్రణ, కరోనా పేషెంట్లకు మౌళిక వసతుల కల్పన విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవసరమైన చర్యలను చేపడుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విమానాల ద్వారా ఆక్సిజన్‌ను తెప్పించేందుకు కృషి చేస్తున్నారు. అలాగే తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆసుపత్రులన్నీ కరోనా పేషంట్లతో నిండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సీఎం కేసీఆర్ సూచించారు. గాంధీ, టిమ్స్ లాంటి పేషంట్లు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. యుద్ధ విమానాలను ఉపయోగించి తీసుకు వస్తున్న ఆక్సిజన్‌ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్‌కి చేరే విధంగా సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య దేశ వ్యాప్తంగా పెరగింది.

ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని మన రాష్ట్రానికి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు సూచించారు. అయితే కిట్స్‌ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిటర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించారు. ఎన్ని లక్షల మందికి అయినా హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్‌ను సమకూర్చాలని సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖను ఆదేశించారు.

More News

‘పుష్ప’లో పవర్‌ఫుల్ పాత్రలో అనసూయ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘రంగస్థలం’ ఇప్పుడప్పుడే ఎవరూ మరచిపోలేరు. ఈ సినిమా అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది.

ఏపీలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్.. పరీక్షలు యథాతధం

ఏపీలో 18 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.

కోవిడ్ రోగిని హైదరాబాద్‌కు విమానంలో తరలించిన సోనూసూద్!

గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో రోడ్డుపైకి వచ్చి నిరంతరం సేవలందించి ప్రముఖ నటుడు సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు.

సంపత్ కుమార్ సమర్పిస్తోన్న ‘లాల్ బాగ్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

రాజమౌళి, ఎన్టీఆర్ ల మూవీ యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ బాగ్’.

హైద్రాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఒరిస్సాకు ఆక్సిజన్ ట్యాంకర్లతో బయల్దేరిన యుద్ధ విమానాలు

తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఒక ముందడుగు వేసి.. దేశానికే ఆదర్శంగా నిలిచింది.