20 ఏళ్లయినా చావలేదు.. రెండు టెర్మ్‌లు నేనే సీఎం!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారం దక్కించుకున్న తర్వాత సీఎంగా కేసీఆర్ కొన్ని రోజులు మాత్రమే కొనసాగుతారని.. ఆ తర్వాత కేటీఆర్‌ను సీఎం చేస్తారని పెద్ద ఎత్తున వార్తలు, ప్రతిపక్ష పార్టీల నేతలు పుకార్లు రేపారు. అయితే ఇంతవరకూ ఈ వ్యవహారంపై స్పందించని కేసీఆర్.. ఆదివారం నాడు అసెంబ్లీ వేదికగా ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. ‘నా ఆరోగ్యం బాగుంది...మరో రెండు టర్మ్‌లు నేనే సీఎం. కేటీఆర్‌ను సీఎంను చేసి నేనేందుకు తప్పుకుంటాను. తెలంగాణలో మరో 3 టర్మ్‌లు టీఆర్‌ఎస్‌దే అధికారం’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
నాకు 66 ఏళ్లే..!
‘నాకు కొంతమంది మిత్రులున్నారని వాళ్లు ఎప్పుడూ నా ఆరోగ్యం ఖతం అయిందని.. అమెరికాకు పోతడట అని ప్రచారం చేస్తున్నారు. గడిచిన 20 ఏళ్లుగా అదే ప్రచారం చేస్తున్నారు.. ఇరవై ఏళ్లయినా నేను చావలేదు. ఇప్పుడు కూడా నాకు ఏం కాలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ దిగిపోయి.. కేటీఆర్‌ను సీఎంను చేస్తాడని కొందరు ప్రచారం చేశారు. నేనెందుకు కేటీఆర్‌ను సీఎంను చేస్తాను. కనిష్టంగా మరో మూడు టర్మ్‌లు టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఉంటుంది. నా ఆరోగ్యం బాగుందని, మరో రెండు టర్మ్‌లు నేనే సీఎంగా ఉంటాను. ఇప్పుడు నాకు 66 ఏళ్లు.. ఇంకో పదేళ్లన్నా సీఎంగా చేయనా.?’ అని తనపై విమర్శలు గుప్పించిన వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout