ప్రజాపాలనతో పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ ప్రభుత్వం
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రజలకు కష్టాలు లేకుండా సులభంగా పథకాలు అందించడం ఏ ప్రభుత్వం పని తీరునైనా తెలియజేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే చాలు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా పాలన అందిస్తుందో అర్థమవుతోంది. ఎందుకంటే ఏదైనా పథకం కావాలన్నా లేదా తమ సమస్య గురించి అధికారులకు తెలియజేయాలనుకునే అక్కడికి వస్తుంటారు. కానీ వారి సమస్య పరిష్కారం కోసం గంటలు, రోజులు తరబడి తిరుగుతుంటారు. కానీ పరిష్కారం మాత్రం దొరకదు. ప్రజలకు సకాలంలో సర్కార్ నుంచి న్యాయం అందుతుందో లేదో ఈ కార్యాలయాలే సాక్ష్యంగా నిలుస్తాయి.
గంటలకొద్దీ క్యూ లైన్లలో ప్రజల అగచాట్లు..
అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏ పథకం, సాయం కావాలన్నా కిలోమీటర్ల కొద్దీ క్యూలైనల్లో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. దరఖాస్తు చేసుకోవాలంటే అది ఎలా నింపాలో తెలియక చదువుకున్న వాళ్లని బతిమాలడటమో, దళారులకు డబ్బులు ఇవ్వడమో చేయాలి. చివరకు ఆ పత్రాలను సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. తీరా ఇంత చేశాక ఆ పథకం అందడం కోసం మళ్లీ తమకు తెలిసిన చోటా మోటా నాయకులు చేత రికమైండేషన్ చేయించాలి. ఇంత చేసినా ఆ పథకం అర్హుల జాబితాలో పేరు ఉంటుందో తెలియదు. దీంతో ఆ రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు..
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇలాంటి కష్టాలు లేకుండా నేరుగా గుమ్మం ముందుకే వచ్చేలా చేస్తుంది. ఇందుకోసం గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినామ క్షణంలో అందుబాటులో ఉంటారు. విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, పెన్షన్లు, ఇన్‌కమ్ సర్టిఫికేట్లు, నివాస, మరణ, జనన ధ్రువీకరణ పత్రాలు.. ఇలా ఒకటేమిటి ప్రభుత్వం నుంచి అందే వందలాది సేవలు ప్రజల ఇంటి ముందుకే వస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు వితంతువులకు ఇచ్చే పెన్షన్లు అయితే తెల్లారేసరికల్లా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు.
ప్రజానాయకుడు పాలన అంటే ఇదే కదా..
ఇవి కాకుండా ఎలాంటి సంక్షేమ పథకం అయినా సిఫార్సులు.. రికమెండేషన్లు లేకుండానే నేరుగా అర్హులకు అందించే బాధ్యత సచివాలయ సిబ్బంది తీసుకుంటున్నారు. దీంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇట్టే అందుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కష్టం లేకుండా చేయడమే కదా ప్రజానాయకుడు పాలన అంటున్నారు. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న ఈ విధానం చూసి ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా అబ్భురపడ్డారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాగే పథకాలు అమలు చేసి తీరుతామంటున్నారు. తన మార్క్ ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout