ప్రజాపాలనతో పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా సీఎం జగన్ ప్రభుత్వం

  • IndiaGlitz, [Sunday,December 31 2023]

ప్రజలకు కష్టాలు లేకుండా సులభంగా పథకాలు అందించడం ఏ ప్రభుత్వం పని తీరునైనా తెలియజేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే చాలు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా పాలన అందిస్తుందో అర్థమవుతోంది. ఎందుకంటే ఏదైనా పథకం కావాలన్నా లేదా తమ సమస్య గురించి అధికారులకు తెలియజేయాలనుకునే అక్కడికి వస్తుంటారు. కానీ వారి సమస్య పరిష్కారం కోసం గంటలు, రోజులు తరబడి తిరుగుతుంటారు. కానీ పరిష్కారం మాత్రం దొరకదు. ప్రజలకు సకాలంలో సర్కార్ నుంచి న్యాయం అందుతుందో లేదో ఈ కార్యాలయాలే సాక్ష్యంగా నిలుస్తాయి.

గంటలకొద్దీ క్యూ లైన్లలో ప్రజల అగచాట్లు..

అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఏ పథకం, సాయం కావాలన్నా కిలోమీటర్ల కొద్దీ క్యూలైనల్లో గంటల కొద్దీ నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. దరఖాస్తు చేసుకోవాలంటే అది ఎలా నింపాలో తెలియక చదువుకున్న వాళ్లని బతిమాలడటమో, దళారులకు డబ్బులు ఇవ్వడమో చేయాలి. చివరకు ఆ పత్రాలను సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. తీరా ఇంత చేశాక ఆ పథకం అందడం కోసం మళ్లీ తమకు తెలిసిన చోటా మోటా నాయకులు చేత రికమైండేషన్ చేయించాలి. ఇంత చేసినా ఆ పథకం అర్హుల జాబితాలో పేరు ఉంటుందో తెలియదు. దీంతో ఆ రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు..

కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇలాంటి కష్టాలు లేకుండా నేరుగా గుమ్మం ముందుకే వచ్చేలా చేస్తుంది. ఇందుకోసం గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినామ క్షణంలో అందుబాటులో ఉంటారు. విద్యార్థుల స్కాలర్‌షిప్పులు, పెన్షన్లు, ఇన్‌కమ్ సర్టిఫికేట్లు, నివాస, మరణ, జనన ధ్రువీకరణ పత్రాలు.. ఇలా ఒకటేమిటి ప్రభుత్వం నుంచి అందే వందలాది సేవలు ప్రజల ఇంటి ముందుకే వస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు వితంతువులకు ఇచ్చే పెన్షన్లు అయితే తెల్లారేసరికల్లా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు.

ప్రజానాయకుడు పాలన అంటే ఇదే కదా..

ఇవి కాకుండా ఎలాంటి సంక్షేమ పథకం అయినా సిఫార్సులు.. రికమెండేషన్లు లేకుండానే నేరుగా అర్హులకు అందించే బాధ్యత సచివాలయ సిబ్బంది తీసుకుంటున్నారు. దీంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇట్టే అందుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వ పనితీరు పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు కష్టం లేకుండా చేయడమే కదా ప్రజానాయకుడు పాలన అంటున్నారు. వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న ఈ విధానం చూసి ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా అబ్భురపడ్డారు. తమ రాష్ట్రాల్లోనూ ఇలాగే పథకాలు అమలు చేసి తీరుతామంటున్నారు. తన మార్క్ ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్.. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

More News

Former DSP Nalini:సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని.. ఏమన్నారంటే..?

తెలంగాణ మాజీ డీఎస్పీ నళిని(Former DSP Nalini) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Guntur Kaaram:'కుర్చీ మడతపెట్టి..'ఫుల్ సాంగ్ వచ్చేసిందిగా.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించే సాంగ్ వచ్చేసింది. న్యూ ఇయర్ కానుకగా 'కుర్చీ మడతపెట్టి..' పుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Modi:అమృత భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ(PM Modi) శ్రీకారం చుట్టారు.

Tamilisai:రాజీనామా వార్తల్లో నిజం లేదు: గవర్నర్ తమిళిసై క్లారిటీ

తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్రంగా ఖండించారు.

YS Jagan: మంచి మనసు చాటుకున్న సీఎం జగన్.. గంటలోనే సమస్యకు పరిష్కారం..

సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy) మరోసారి మానవత్వం చాటుకున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆపదలో ఉన్నామని వచ్చిన వారి వినతలు స్వీకరిస్తూ...